'పెళ్లి చూపులు' డైరెక్టర్ తాజా చిత్రం.. ఈ రోజు నుంచే షూటింగ్!
- 'పెళ్లి చూపులు'తో దర్శకుడిగా తరుణ్ భాస్కర్ కి మంచి పేరు
- కొత్త వాళ్లతో మరో ప్రాజెక్టు
- అందరిలోను ఆసక్తి
అలాంటి తరుణ్ భాస్కర్ మరో కథను సిద్ధం చేసుకుని, ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నారు. అంతా కొత్త వాళ్లతో ఆయన ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'పెళ్లి చూపులు' సినిమాను జనంలోకి తీసుకెళ్లి .. ఆ సినిమా సక్సెస్ లో సురేశ్ బాబు కీలకమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ మరో సంచలనానికి తెరతీస్తాడేమో చూడాలి.