ఇలాంటి సినిమా చేస్తూ చనిపోయినా ఫరవాలేదు : మంచు మనోజ్
తాను పుట్టి పెరిగింది చెన్నైలో కనుక తనకు శ్రీలంక తమిళుల కష్టాలు తెలుసని, వాళ్లు పడిన బాధలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే తాను ఈ సినిమా చేయడానికి అంగీకరించానని చెప్పాడు. ఈ ఉద్దేశంతోనే ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నామని అన్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, మనోజ్ ఎకౌంట్ లో హిట్ ను జమ చేస్తుందేమో చూడాలి.