పవన్ నెక్స్ట్ మూవీ మరింత ఆలస్యం!
ప్రస్తుతం పవన్ ఒక వైపున సినిమాలు .. మరో వైపున రాజకీయాలకి సమాన ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. సినిమాలు చేస్తోన్న సమయంలో ఆయన కొన్ని సామాజిక సమస్యలపై వెంటనే స్పందించలేకపోతున్నాడు. ఫలితంగా వ్యతిరేక వర్గం నుంచి అనేక విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా అక్టోబర్ నుంచి ఎక్కువ సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని పవన్ చెప్పాడు. దాంతో మైత్రీ మూవీస్ బ్యానర్లో ఆయన తదుపరి సినిమా పట్టాలెక్కడానికి మరింత ఆలస్యం అవుతుందనేది స్పష్టమవుతోంది.