దానం వలన ధనం వృద్ధి చెందుతుంది

మూగ జంతువుల పట్ల జాలి - ప్రేమ చూపించడం, తోటివారి పట్ల దయను కలిగి ఉండటాన్ని లక్ష్మీదేవి ఇష్టపడుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పశువులకు .. పక్షులకు ఆహారాన్ని అందించేవారికి, ఎలాంటి లోటు రాకుండా లక్ష్మీదేవి చూసుకుంటుంది. వారి ద్వారా వాటికి ఆహారం సమకూరాలి కనుక, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. ఆ ఇంట లేమి అనే మాట వినిపించకుండా చూస్తుంటుంది.

అలాగే ఎవరికి వారు .. నిస్సహాయ స్థితిలో వున్నవారికి తమవంతు సాయంగా దానం చేయాలి. నిస్సహాయ స్థితిలో వున్నవారికి ప్రేమతో దానం చేయడం అమ్మవారికి ప్రీతిని కలిగిస్తుంది. తాను ఇచ్చిన సంపద సద్వినియోగమవుతుందనే ఉద్దేశంతో .. దానం చేసినవారి సంపదను పెంచుతుంది. మరికొందరికి దానం చేస్తారనే ఉద్దేశంతోనే .. వాళ్లకి అమ్మవారు అలా కలిగిస్తుంది. పుణ్య క్షేత్రాల్లోను .. నదీ తీరాల్లోను .. ఆలయ సమీపంలోని చేసే దానాల వలన అమ్మవారు మరింత సంతోష పడుతుందట. దానం చేసే వారికి అనేక రెట్లు అధికంగా లభించేలా అనుగ్రహిస్తుందట. అందువలన దానం వలన ధనవృద్ధి జరుగుతుందని పెద్దలు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.       


More Bhakti News