వేదికపై దలేర్ మెహందీకి అవమానం.. తాగొచ్చావంటూ మంత్రి ఫైర్!
- ఉత్తరాఖండ్‌లో నవరాత్రి వేడుకల్లో సింగర్ దలేర్ మెహందీకి అవమానం
- మద్యం తాగి వేదికపైకి వచ్చారని ఆరోపించిన మంత్రి సుబోధ్ ఉనియాల్
- మాట్లాడటమే సరిగ్గా రావడం లేదంటూ సింగర్‌పై మంత్రి ఆగ్రహం
- ప్రజలను మోసం చేస్తున్నావంటూ వేదికపైనే నిలదీసిన మంత్రి
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన వీడియో
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీకి తీవ్ర అవమానం ఎదురైంది. ఉత్తరాఖండ్‌లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రదర్శన ఇస్తుండగా, రాష్ట్ర కేబినెట్ మంత్రి సుబోధ్ ఉనియాల్ వేదికపైనే ఆయనను నిలదీశారు. దలేర్ మెహందీ మద్యం మత్తులో ఉన్నారని, పవిత్రమైన కార్యక్రమాన్ని అగౌరవపరుస్తున్నారని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే, టెహ్రీలోని కుంజాపురి మేళాలో ఈ ఘటన జరిగింది. దలేర్ మెహందీ ప్రదర్శన మధ్యలో మంత్రి సుబోధ్ వేదికపైకి వచ్చి మైక్ అందుకున్నారు. "నీకు సరిగ్గా మాట్లాడటమే రావట్లేదు, ఇక పాటేం పాడతావ్?" అని దలేర్ మెహందీని సూటిగా ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
మంత్రి అంతటితో ఆగకుండా, "ప్రజలకు వినోదం పంచుతావనే నమ్మకంతో నీకు అంత డబ్బు ఇచ్చి పిలిపించాం. కానీ నువ్వు మమ్మల్ని ఫూల్స్ చేస్తున్నావ్. ఇది చాలా తప్పు. నీకు పెద్ద పేరుందని ఇక్కడికి పిలిస్తే, ఇలా ప్రవర్తిస్తావా?" అంటూ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించిన దలేర్ మెహందీ.. "సర్, దయచేసి వేదిక దిగి వెళ్లండి" అని చేతులు జోడించి కోరారు.
మంత్రి, సింగర్ మధ్య జరిగిన ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మంత్రి చర్యను సమర్థిస్తూ, "పవిత్ర వేదికపై మద్యం సేవించి రావడం దారుణం" అని కామెంట్ చేయగా, మరికొందరు "ఒక కళాకారుడిని బహిరంగంగా అలా అవమానించడం సరికాదు" అని అభిప్రాయపడుతున్నారు.