అంబానీల నవరాత్రి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా ధోనీ.. ఆ రైడ్ ఎక్కనంటూ సరదా సైగలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంబానీల నవరాత్రి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా ధోనీ.. ఆ రైడ్ ఎక్కనంటూ సరదా సైగలు!

MS Dhoni special attraction at Ambani Navratri celebrations funny gestures on carnival rides
  • గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంబానీల నవరాత్రి వేడుకలు
  • భార్య సాక్షితో కలిసి పాల్గొన్న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ
  • అనంత్ అంబానీతో కలిసి కార్నివాల్‌లో సందడి
  • ఒక రైడ్ ఎక్కేందుకు సరదాగా నిరాకరించిన ఎంఎస్‌డీ
  • వేడుకలకు సంబంధించిన వీడియోలు వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, అత‌ని అర్ధాంగి సాక్షి.. అంబానీ కుటుంబం నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో సందడి చేశారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయన్స్ టౌన్‌షిప్‌లో నిన్న‌ జరిగిన ఈ వేడుకల్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌తో కలిసి ధోనీ దంపతులు పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్నివాల్‌లో ధోనీ, అనంత్ అంబానీ సరదాగా గడిపారు. ఇద్దరూ కలిసి డ్రాగన్ బోట్ వంటి ఫాస్ట్ రైడ్‌ను ఎంజాయ్ చేశారు. అభిమానులతో ముచ్చటిస్తూ, సాక్షితో కలిసి ఐస్‌క్రీం తింటూ ధోనీ చాలా కూల్‌గా కనిపించారు. ఈ కార్నివాల్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 

గిరగిరా తిరిగే ఒక రైడ్ ఎక్కమని అనంత్ అంబానీ ధోనీని ఆహ్వానించారు. అయితే, దానికి ధోనీ సున్నితంగా నిరాకరించారు. ఆ రైడ్ ఎక్కితే తనకు కళ్లు తిరుగుతాయని సరదాగా సైగలు చేస్తూ వివరించారు.

అంబానీ కుటుంబం ఏర్పాటు చేసిన ఈ నవరాత్రి వేడుకల్లో కార్నివాల్ రైడ్స్‌తో పాటు గర్బా, ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ధోనీ, అనంత్ అంబానీ కలిసి గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
Advertisement
MS Dhoni
Anant Ambani
Ambani Navratri Celebrations
Jamnagar Carnival
Sakshi Dhoni
MS Dhoni Viral Video

More Telugu News