పాకిస్థాన్‌లో ఆకలి కేకలు.. నివేదికలో షాకింగ్ విషయాలు!
- ప్రపంచ ఆహార సంక్షోభంలో టాప్ 10 దేశాల జాబితాలోకి పాకిస్థాన్
- ఆర్థిక ఒత్తిళ్లు, వాతావరణ మార్పులతో తీవ్రమవుతున్న ఆహార అభద్రత
- దేశంలో నాలుగింట ఒక కుటుంబం ఆహార కొరతను ఎదుర్కొంటోందని వెల్లడి
- గోధుమలు, బియ్యం, మాంసం వంటి వాటి వినియోగం క్షీణత
- గ్రామీణ ప్రాంతాల్లో కోటి మందికి పైగా ప్రజలు తీవ్ర ఆహార సంక్షోభంలో ఉన్నట్లు నివేదిక
ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టాప్ 10 దేశాల జాబితాలో పాకిస్థాన్ చేరింది. ఆర్థిక ఒత్తిళ్లు, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలు, సహాయం అందడంలో తగ్గుదల వంటి కారణాలతో ఆ దేశంలో ఆహార అభద్రత రోజురోజుకు తీవ్రమవుతోందని ఒక నివేదిక హెచ్చరించింది. ‘ప్రాఫిట్ బై పాకిస్థాన్ టుడే’ విశ్లేషణ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 47 దేశాల్లో 266 మిలియన్ల మంది తీవ్రమైన ఆకలితో అల్లాడుతున్నారు. ఈ సంఖ్య దశాబ్దం క్రితంతో పోలిస్తే రెట్టింపు కావడం గమనార్హం.
తీవ్ర ఆహార సంక్షోభంతో బాధపడుతున్న వారిలో దాదాపు మూడింట రెండొంతుల మంది, అంటే సుమారు 177 మిలియన్ల ప్రజలు కేవలం పది దేశాల్లోనే ఉన్నారు. ఆ జాబితాలో పాకిస్థాన్‌తో పాటు ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, నైజీరియా, కాంగో, సూడాన్, యెమెన్, మయన్మార్, దక్షిణ సూడాన్, సిరియా ఉన్నాయి. జనాభా శాతంతో కాకుండా, ఆకలితో బాధపడుతున్న ప్రజల సంఖ్య ఆధారంగా పాకిస్థాన్‌ను ఈ జాబితాలో చేర్చినట్లు నివేదిక స్పష్టం చేసింది.
పాకిస్థాన్‌లోని 51 గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 1.06 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బలహీన వర్గాలు వాతావరణ మార్పుల ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నాయి. 2018-19లో 15.92 శాతంగా ఉన్న మధ్యస్థ, తీవ్ర ఆహార అభద్రత కలిగిన కుటుంబాల సంఖ్య, 2024-25 నాటికి 24.35 శాతానికి పెరిగింది. అంటే.. ప్రస్తుతం దేశంలో దాదాపు ప్రతి నాలుగు కుటుంబాల్లో ఒక కుటుంబం ఆహార కొరతతో ఇబ్బంది పడుతోంది. ఇదే సమయంలో తీవ్రమైన ఆహార అభద్రత 2.37 శాతం నుంచి 5.04 శాతానికి పెరిగి రెట్టింపయింది.
పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (పీబీఎస్) గణాంకాల ప్రకారం.. జూన్ 2019 నుంచి జూన్ 2025 మధ్య కాలంలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) 117 శాతం పెరగడం ఆర్థిక ఒత్తిళ్లకు అద్దం పడుతోంది. దీనికి తోడు వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయ ఉత్పత్తి తగ్గి, గ్రామీణ కుటుంబాల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ప్రజలు ఆహారం కోసం మార్కెట్లపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది.
ఈ కాలంలో ప్రజలు గోధుమలు, బియ్యం, పప్పులు, మాంసం, గుడ్లు, పాల వినియోగాన్ని తగ్గించారని, అయితే వనస్పతి నెయ్యి వాడకం మాత్రం 81 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. ఆదాయం తగ్గడం, ధరలు పెరగడం వంటి కారణాలతో పాక్‌లో ఆహార లభ్యత, కొనుగోలు సామర్థ్యం రెండూ దెబ్బతిన్నాయి.