క్యాన్సర్ రోగులకు భారీ ఊరట.. 137 మందుల ధరలు 70 శాతం వరకు తగ్గుదల!
- 137 క్యాన్సర్ మందులపై 30 శాతం ట్రేడ్ మార్జిన్ పరిమితి
- రోగులకు ఏటా రూ. 2,500 కోట్ల ఆదా అంచనా
- నవంబర్ 9 నుంచి అమల్లోకి కొత్త ధరలు
క్యాన్సర్ చికిత్సతో ఆర్థికంగా కుంగిపోతున్న రోగులకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద ఊరట కల్పించింది. అత్యంత కీలకమైన 137 రకాల క్యాన్సర్ నిరోధక మందులపై ట్రేడ్ మార్జిన్ను 30 శాతానికే పరిమితం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఈ మందుల గరిష్ట చిల్లర ధరలు (ఎంఆర్పీ) 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త ధరలు నవంబర్ 9వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.
నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) అక్టోబర్ 17న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రగ్స్ (ప్రైసెస్ కంట్రోల్) ఆర్డర్, 2013లోని పారా 19 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం, తయారీదారు నుంచి వినియోగదారుడికి చేరే క్రమంలో స్టాకిస్టులు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్ల లాభం కలిపి గరిష్టంగా 30 శాతానికి మించకూడదు. ఈ నిర్ణయంతో రోగులకు ఏటా సుమారు రూ. 2,500 కోట్ల మేర ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన 137 మందుల జాబితాలో నివోలుమాబ్, బెవాసిజుమాబ్, అటెజోలిజుమాబ్, ఓలపారిబ్, డెనోసుమాబ్, పెగ్ఫిల్గ్రాస్టిమ్, ఎన్జలుటమైడ్ వంటి ఖరీదైన ఔషధాలు ఉన్నాయి. బ్రాండెడ్, జనరిక్, దేశీయ, దిగుమతి చేసుకున్న, పేటెంట్ ఉన్న, పేటెంట్ లేని అన్ని రకాల మందులకు ఈ నిబంధన వర్తిస్తుంది.
క్యాన్సర్ మందుల అధిక ధరలపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గతంలో 2019లో కూడా 42 క్యాన్సర్ మందులపై ఇదే తరహాలో ట్రేడ్ మార్జిన్ను నియంత్రించడం ద్వారా ధరలను గణనీయంగా తగ్గించారు.
ఈ ఆదేశాల ప్రకారం, ఔషధ తయారీదారులు 7 రోజుల్లోగా సవరించిన ధరల జాబితాను ఎన్పీపీఏకి సమర్పించి, తమ వెబ్సైట్లలో ప్రచురించాలి. రిటైలర్లు, ఆసుపత్రులు తప్పనిసరిగా కొత్త ధరలనే వసూలు చేయాలని, రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్లు దీన్ని పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.