వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవు: నటి నేహా శర్మ
- ఏఐ మార్ఫింగ్ ఫొటోలపై నేహా శర్మ సీరియస్
- ఇది తన ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్య అని ఆవేదన
- అనధికార వీడియోలు, ఇమేజ్‌లను వెంటనే తొలగించాలని డిమాండ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి తన ఫొటోలు, వీడియోలను అనధికారికంగా వాడుతున్న వారిపై బాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా సృష్టించిన ఏఐ కంటెంట్ తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోందని, ఇలాంటివి పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేశారు.
"నా ఫొటో లేదా పోలికలతో ఏఐ వీడియోలు, ఇమేజ్‌లు సృష్టిస్తున్న వారు వెంటనే ఆపాలి. ఇప్పటికే పోస్ట్ చేసిన కంటెంట్‌ను తక్షణమే తొలగించండి. నా గుర్తింపును ఉపయోగించి కొత్తగా ఎలాంటి ఏఐ కంటెంట్‌ను తయారుచేయవద్దు, ఎడిట్ చేయవద్దు, సర్క్యులేట్ చేయవద్దు" అని ఆమె స్పష్టం చేశారు.
"ఈ విధంగా నా ముఖాన్ని ఉపయోగించి నన్ను తప్పుగా చిత్రీకరించడం లేదా నా ప్రతిష్ఠ దెబ్బతీయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నా ముఖాన్ని లేదా పోలికలను అనధికారికంగా ఉపయోగించడానికి నేను అంగీకరించను. ఈ పోస్ట్‌ను అధికారిక హెచ్చరికగా పరిగణించండి. ఇలాంటి కంటెంట్‌ను సృష్టించిన, పోస్ట్ చేసిన, సర్క్యులేట్ చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఫేక్ అకౌంట్లు లేదా ఏఐ టెక్నాలజీ వెనుక దాక్కుంటే శిక్ష నుంచి తప్పించుకోలేరు" అని నేహా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని డీప్‌ఫేక్, మార్ఫింగ్ కంటెంట్ పెరుగుతున్న నేపథ్యంలో నేహా శర్మ హెచ్చరిక ప్రాధాన్యత సంతరించుకుంది.