అమెరికా ఎన్నికల్లో అక్రమ ఓటు.. రెండేళ్ల తర్వాత భారత జాతీయుడి అరెస్ట్
- 2024 ఎన్నికల్లో యూఎస్ పౌరుడినంటూ నమ్మించిన ముఖేశ్ కుమార్ చౌదరి
- మిన్నెసోటాలో ఓటు వేసినట్లు గుర్తించిన హోంల్యాండ్ సెక్యూరిటీ
- నేరం రుజువైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం
అమెరికాలో ఓ భారత జాతీయుడిని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. 2024లో జరిగిన అమెరికా సాధారణ ఎన్నికల్లో, తాను యూఎస్ పౌరుడినని తప్పుడు సమాచారం ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. నిందితుడిని అహ్మదాబాద్కు చెందిన ముఖేశ్ కుమార్ సోమాభాయ్ చౌదరిగా గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే, 2024 నవంబర్ 5న మిన్నెసోటాలోని ఓ పోలింగ్ కేంద్రంలో చౌదరి ఓటు వేశారు. ఓటు వేసేందుకు అవసరమైన పత్రాలపై సంతకం చేసే క్రమంలో, తాను అమెరికా పౌరుడినని ఆయన ధ్రువీకరించారని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరిపిన యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE), హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ (HSI) అధికారులు చౌదరిని అరెస్ట్ చేశారు. ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ ఆయనపై అభియోగాలు నమోదు చేసిన తర్వాత ఈ అరెస్ట్ జరిగింది.
చౌదరిపై ఓటింగ్లో తప్పుడు సమాచారం ఇవ్వడం, ఓటు వేయడం కోసం తప్పుడు పౌరసత్వ క్లెయిమ్ చేయడం వంటి రెండు అభియోగాలు మోపారు. అమెరికాలో ఓటు హక్కు అనేది పౌరుల పవిత్రమైన హక్కు అని, దానిని కాపాడతామని యూఎస్ న్యాయ శాఖ స్పష్టం చేసింది. చట్టవిరుద్ధంగా ఓటు వేసే విదేశీయులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే దేశ బహిష్కరణ కూడా చేస్తామని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం హెచ్చరించింది.
ఈ కేసులో చౌదరిపై నేరం రుజువైతే, ఒక్కో అభియోగానికి గరిష్టంగా ఐదేళ్ల చొప్పున, మొత్తం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.