జైస్వాల్‌కు అన్యాయం జరిగింది.. సెలక్టర్లపై అశ్విన్ అసంతృప్తి
- న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జైస్వాల్‌ను ఎంపిక చేయకపోవడంపై అశ్విన్ అసంతృప్తి
- సెలక్టర్ల నిర్ణయం అన్యాయం, దురదృష్టకరం అంటూ వ్యాఖ్య
- గిల్‌కు విశ్రాంతి ఇచ్చినప్పుడు జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలని సూచన
భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను న్యూజిలాండ్ పర్యటనకు వన్డే జట్టు నుంచి తప్పించడంపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సెలక్టర్ల నిర్ణయం అన్యాయమని, దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ సెలక్షన్ కమిటీ తీరును తప్పుబట్టారు.
న్యూజిలాండ్ పర్యటనలో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి రెండు మ్యాచ్‌లకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో గిల్ స్థానంలో యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని అశ్విన్ వాదించారు. "శుభ్‌మన్ గిల్ చివరి రెండు వన్డేలు ఆడకపోతే, ఆ స్థానం కచ్చితంగా యశస్వి జైస్వాల్‌కు దక్కాలి. ఇలా జరగడం చాలా దురదృష్టకరం" అని అశ్విన్ పేర్కొన్నారు.
గత నాలుగు నెలలుగా జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్లో ఏ ఫార్మాట్లోనూ మ్యాచ్ ఆడలేదని అశ్విన్ గుర్తుచేశారు. "ఒకప్పుడు అతను పరుగుల యంత్రంలా ఆడాడు. ఇలాంటి పరిస్థితులు ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ప్రతిభావంతులైన ఆటగాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లపై ఉంటుంది" అని ఆయన హితవు పలికారు.
అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. వన్డే జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన జైస్వాల్, టెస్టు సిరీస్‌కు మాత్రం ఎంపికయ్యాడు.