ఈ స్కూటర్లు భలే వెరైటీ.. భారత్‌లోకి ఇటలీ బ్రాండ్ 'ఇటాల్జెట్'!
- భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్న ఇటాలియన్ ప్రీమియం స్కూటర్ల బ్రాండ్ ఇటాల్జెట్
- కొల్హాపూర్‌కు చెందిన మోటోహాస్ ఇండియాతో భాగస్వామ్యం
- విభిన్నమైన డిజైన్, అధిక పనితీరు కలిగిన డ్రాగ్‌స్టర్ సిరీస్‌కు ప్రసిద్ధి
- భారత్‌కు డ్రాగ్‌స్టర్ 125, 300 మోడళ్లు వచ్చే అవకాశం
- వచ్చే నెలలో జరిగే EICMA 2026లో పూర్తి వివరాల వెల్లడి
భారత ద్విచక్ర వాహన మార్కెట్లోకి మరో ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ ప్రవేశిస్తోంది. ఇటలీకి చెందిన ప్రీమియం స్కూటర్ల తయారీ సంస్థ ఇటాల్జెట్ (Italjet) త్వరలో భారత్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇందుకుగానూ కొల్హాపూర్‌కు చెందిన మోటోహాస్ ఇండియా (Motohaus India) సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే మోటోహాస్ ఇండియా.. బ్రిక్స్టన్ మోటార్‌సైకిళ్లు, విఎల్ఎఫ్ (వెలొసిఫెరో) స్కూటర్లను దేశంలో పంపిణీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటాల్జెట్ రాకతో ప్రీమియం స్కూటర్ల విభాగంలో పోటీ మరింత పెరగనుంది.
ఇటలీలోని బోలోగ్నా కేంద్రంగా పనిచేసే ఇటాల్జెట్, తన అసాధారణమైన డిజైన్లు, అధిక పనితీరు గల స్కూటర్లకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఈ సంస్థ అందిస్తున్న "డ్రాగ్‌స్టర్" (Dragster) సిరీస్ స్కూటర్లు తమ ర్యాడికల్ లుక్‌తో వాహన ప్రియులను ఆకర్షిస్తున్నాయి. భారత్‌లో ఏయే మోడళ్లను విడుదల చేయనున్నారు, వాటి ధరలు, లాంచ్ వివరాలను వచ్చే నెల మిలాన్‌లో జరిగే EICMA 2026 మోటార్ షోలో అధికారికంగా వెల్లడించనున్నారు.
ఇటల్జెట్ లైనప్‌లో డ్రాగ్‌స్టర్ 125 నుంచి 700 సీసీ వరకు స్కూటర్లు ఉన్నాయి. వీటిలో అత్యంత శక్తివంతమైన డ్రాగ్‌స్టర్ 700 మోడల్, 698cc లిక్విడ్-కూల్డ్ ట్విన్-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 69 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జతచేయడం ఒక ప్రత్యేకత. అయితే, భారత మార్కెట్లోకి డ్రాగ్‌స్టర్ 125, డ్రాగ్‌స్టర్ 300 మోడళ్లను తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ స్కూటర్లు అండర్‌బోన్ ఛాసిస్, ప్రత్యేకమైన ఫ్రంట్ సస్పెన్షన్, బ్రాండ్ పేటెంట్ పొందిన ఇండిపెండెంట్ స్టీరింగ్ సిస్టమ్ (ISS), బయటకు కనిపించే ట్రెల్లిస్ ఫ్రేమ్ వంటి విశిష్టమైన ఫీచర్లతో వస్తాయి. ఇటాల్జెట్ రాకతో భారత వినియోగదారులకు ప్రీమియం స్కూటర్ల విభాగంలో ఒక కొత్త, విభిన్నమైన ఎంపిక అందుబాటులోకి రానుంది.