బాక్సాఫీస్ వద్ద 'జైలర్ 2' గర్జన.. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాక్సాఫీస్ వద్ద 'జైలర్ 2' గర్జన.. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు!

Jailer 2 destruction at box office record collections worldwide on first day
  • రజనీకాంత్ 'జైలర్ 2'కు తొలిరోజు రికార్డు స్థాయి వసూళ్లు
  • ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ. 125.25 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రం
  • భారత్‌లో రూ. 59.70 కోట్ల నెట్, ఓవర్సీస్‌లో రూ. 55 కోట్లు రాబట్టిన మూవీ
  • తెలుగు రాష్ట్రాల్లోనూ సత్తా చాటిన సినిమా.. తొలిరోజు రూ. 12.50 కోట్లు వసూలు
  • తమిళంలో రూ. 43.35 కోట్లతో అత్యధిక వసూళ్ల నమోదు
సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించారు. ఆయన కథానాయకుడిగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జైలర్ 2' చిత్రం నిన్న థియేట‌ర్ల‌లోకి విడుద‌లైంది. విడుదలై తొలిరోజే వసూళ్ల సునామీ సృష్టించింది. ప్రముఖ ట్రేడ్ వర్గాల ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 125.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇది తమిళ చిత్ర పరిశ్రమలో భారీ ఓపెనింగ్‌గా నిలిచింది.

ప్రముఖ ట్రేడ్ ట్రాకర్ 'శాక్‌నిల్క్' వెల్లడించిన వివరాల ప్రకారం.. 'జైలర్ 2' భారత్‌లో తొలిరోజు రూ. 59.70 కోట్ల నెట్, రూ. 70.25 కోట్ల వసూళ్లను సాధించింది. దేశవ్యాప్తంగా దాదాపు 16,599 షోల ద్వారా ఈ వసూళ్లు రాగా, సగటున 55.4% ఆక్యుపెన్సీ నమోదైంది. 

మరోవైపు ఓవర్సీస్ మార్కెట్లలోనూ రజినీ మేనియా స్పష్టంగా కనిపించింది. విదేశాల్లో ఈ చిత్రం మొదటి రోజే రూ. 55 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం మీద 37 లక్షలకు పైగా ప్రేక్షకులు తొలిరోజే ఈ సినిమాను థియేటర్లలో వీక్షించారు.

భాషల వారీగా చూస్తే, తమిళ వెర్షన్ వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క తమిళనాడులోనే 9,326 షోల ద్వారా రూ. 43.35 కోట్ల నెట్ వసూలు చేసి, 70.8% భారీ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. 

తెలుగు రాష్ట్రాల్లోనూ 'జైలర్ 2'కు ఘన స్వాగతం లభించింది. ఇక్కడ ఈ చిత్రం తొలిరోజు రూ. 12.50 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక హిందీలో రూ. 3.50 కోట్లు, కన్నడలో రూ. 0.35 కోట్లు వసూలు చేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన రాష్ట్రాల్లో తమిళనాడు తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ, కేరళ నిలిచాయి.

అయితే, ఇటీవల విడుదలైన 'కూలీ', 'లియో' చిత్రాల తొలిరోజు ప్రపంచవ్యాప్త వసూళ్లతో పోలిస్తే 'జైలర్ 2' కాస్త వెనుకబడినప్పటికీ, తమిళ సినీ చరిత్రలో ఇది మూడవ అతిపెద్ద ఓపెనింగ్‌గా నిలిచింది. ప్రస్తుతం వెలువడినవి ప్రాథమిక అంచనాలు మాత్రమేనని, తుది లెక్కల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
Advertisement
Rajinikanth
Jailer 2 Box Office Collection
Nelson Dilipkumar
Jailer 2 Day 1 Worldwide Collection
Tamil Cinema Record Openings
Sacnilk Box Office Report

More Telugu News