ఒకప్పుడు పొగాకు డబ్బాలే లంచ్ బాక్సులు.. 200 ఏళ్లలో ఎన్ని మార్పులో తెలుసా?
- మొదట కార్మికులు లోహపు డబ్బాలు వాడేవారు
- పిల్లలు పాత పొగాకు డబ్బాల్లో భోజనం తీసుకెళ్లేవారు
- 1902లో ప్రత్యేక లంచ్ బాక్సులు అందుబాటులోకి
- 1935లో మిక్కీ మౌస్ బాక్స్‌తో కొత్త మార్పు
- 1980ల నుంచి ప్లాస్టిక్ బాక్సుల వాడకం
మనం రోజూ స్కూల్‌కు, ఆఫీసులకు తీసుకెళ్లే లంచ్ బాక్సుల వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఇప్పుడు రకరకాల రంగులు, ఆకారాల్లో కనిపించే లంచ్ బాక్సులు ఒకప్పుడు ఇలా ఉండేవి కావు. దాదాపు 200 ఏళ్ల క్రితం కార్మికులు తమ భోజనం తీసుకెళ్లేందుకు వాడిన సాధారణ లోహపు డబ్బాలే క్రమంగా నేటి లంచ్ బాక్సులుగా మారాయి. మరి ఈ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం..
పొగాకు డబ్బాలతో మొదలైన ప్రయాణం
19వ శతాబ్దంలో పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందాయి. కర్మాగారాలు, బొగ్గు గనులు, రైల్వే నిర్మాణ పనుల్లో లక్షలాది మంది పనిచేసేవారు. వారు ఎక్కువ సమయం ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చేది. దీంతో ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లడం అవసరమైంది. పని చేసే చోట దుమ్ము, ధూళి నుంచి ఆహారాన్ని కాపాడుకునేందుకు గట్టి లోహపు డబ్బాలను వాడేవారు.
పిల్లల చేతుల్లోకి ఎలా వచ్చాయి?
1880ల నాటికి పిల్లలు కూడా ఇంటి నుంచి భోజనం స్కూల్‌కు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. అయితే అప్పట్లో పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన లంచ్ బాక్సులు ఎక్కువగా అందుబాటులో ఉండేవి కావు. దీంతో కొందరు ఖాళీ బిస్కెట్ డబ్బాలు, పాత పొగాకు డబ్బాలను భోజనం తీసుకెళ్లేందుకు వాడేవారు. 1902లో పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన లంచ్ బాక్సులు మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో కొన్ని చిన్న పిక్నిక్ బుట్టల్లా ఉండేవి.
మిక్కీ మౌస్‌తో కొత్త మలుపు
1935లో మిక్కీ మౌస్ బొమ్మతో కూడిన లంచ్ బాక్స్ అందుబాటులోకి వచ్చింది. దీంతో లంచ్ బాక్సుల రూపం, అమ్మకాల విధానం మారిపోయాయి. పిల్లలకు ఇష్టమైన కార్టూన్ పాత్రల బొమ్మలను డబ్బాలపై ముద్రించడం మొదలైంది. దీంతో అవి పిల్లలను మరింతగా ఆకర్షించాయి.
ప్లాస్టిక్ నుంచి స్టీల్ వరకు
1980ల నాటికి ప్లాస్టిక్ లంచ్ బాక్సుల వాడకం పెరిగింది. ఇవి తేలికగా ఉండటం, తక్కువ ధరకు లభించడం, తుప్పు పట్టకపోవడం వంటి కారణాలతో ఆదరణ పొందాయి. రంగులు, ఆకారాలు, డిజైన్లలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి.
ఇప్పుడు వేడి తగ్గకుండా ఆహారాన్ని ఉంచే డబ్బాలు, స్టెయిన్‌లెస్ స్టీల్ బాక్సులు, బీపీఏ రహిత ప్లాస్టిక్ డబ్బాలు అందుబాటులో ఉన్నాయి. జపాన్‌లో వాడే బెంటో బాక్సులు, మన దగ్గర కనిపించే అరలు ఉన్న క్యారియర్ డబ్బాలు కూడా ప్రత్యేకమే. ఆహారం చిందకుండా మూతలు, వేర్వేరు వంటకాల కోసం ప్రత్యేక అరలు వంటి సదుపాయాలు వచ్చాయి.
ఒకప్పుడు కార్మికులు భోజనం తీసుకెళ్లేందుకు వాడిన సాధారణ డబ్బాలు.. నేడు విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబాలకు అవసరమైన వస్తువుగా మారాయి. మారుతున్న జీవనశైలి, సాంకేతికతతో పాటు లంచ్ బాక్సుల రూపం కూడా పూర్తిగా మారిపోయింది.