చనిపోయినా వదలట్లేదు.. అసలు నానా పటేకర్‌తో తనూశ్రీ దత్తా వివాదం ఏంటి?
- 2008 సినిమా షూటింగ్‌లో వివాదం మొదలు
- అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డారని తనూశ్రీ ఆరోపణ
- ఓ ప్రత్యేక పాట చిత్రీకరణ సమయంలో ఇలా జరిగిందన్న తనూశ్రీ
- 2018లో మీటూ ఉద్యమ సమయంలో ఆరోపణలు
- ఆరోపణలను ఖండించిన నానా పటేకర్
బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ మరణం తర్వాత నటి తనూశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. నానా పటేకర్‌ను ఉద్దేశించి ఆమె ‘ఈవిల్ డెడ్’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చినా తనూశ్రీ వెనక్కి తగ్గలేదు. తన వ్యాఖ్యలను సమర్థించుకుంది. ఇంతకీ వీరిద్దరి మధ్య వివాదం ఎక్కడ మొదలైంది? 2008లో జరిగిన ఓ సినిమా షూటింగ్ సమయంలో అసలేం జరిగింది?
2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తనూశ్రీ దత్తా.. అదే ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత 2005లో ‘ఆషిక్ బనాయా ఆప్నే’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. చాక్లెట్, భాగమ్ భాగ్, ఢోల్, గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ వంటి సినిమాల్లో నటించింది.
నానా పటేకర్, తనూశ్రీ దత్తా 2008లో వచ్చిన ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమాలో కలిసి పనిచేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది.
ఆ సినిమాలో ఓ ప్రత్యేక పాట చిత్రీకరణ సందర్భంగా నానా పటేకర్ తనతో అనుచితంగా ప్రవర్తించారని తనూశ్రీ ఆరోపించింది. ఆ సమయంలో ఆయన ప్రవర్తన తనను ఇబ్బందికి గురిచేసిందని తెలిపింది. ఆ ఘటన గురించి 2018లో మరోసారి బహిరంగంగా మాట్లాడటంతో ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది.
2018 సెప్టెంబరులో తనూశ్రీ చేసిన ఆరోపణలు అప్పట్లో ‘మీటూ’ ఉద్యమంలో కీలకంగా మారాయి. పాట చిత్రీకరణలో తనతో పాటు మరో నటుడు మాత్రమే ఉండాల్సి ఉండగా.. నానా పటేకర్ కూడా సన్నిహితంగా ఉండే నృత్య కదలికల్లో పాల్గొనాలని కోరుకున్నారని ఆమె ఆరోపించింది. దీనిపై తాను అభ్యంతరం తెలిపినట్లు చెప్పింది. అయితే తనూశ్రీ ఆరోపణలను నానా పటేకర్ ఖండించారు. అవి అసత్యమని పేర్కొన్నారు.
ఈ వివాదం తర్వాత సినీ, టీవీ ఆర్టిస్టుల సంఘం (సింటా) స్పందించింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) సహా పలువురు ఈ వివాదంలోకి వచ్చారు. తనూశ్రీ ఫిర్యాదు తర్వాత ముంబయి పోలీసులు నానా పటేకర్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఆయన తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. మరోవైపు ఫిర్యాదులోని అంశాలపై చట్టపరమైన గడువు ముగిసిందని, ఆధారాల కొరత కారణంగా కేసును ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం లేదని కోర్టు నిర్ణయించింది.