ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాల్లో స్థానిక ఎన్నికలను పెండింగ్ లో పెడుతున్నాం: నారాయణ
Add ap7am to your home Screen

ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాల్లో స్థానిక ఎన్నికలను పెండింగ్ లో పెడుతున్నాం: నారాయణ

Narayana says local elections pending in land pooling villages
  • అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని నారాయణ ఆదేశాలు
  • అక్టోబర్ 2028 నాటికి రాజధాని పూర్తి చేయడమే లక్ష్యమని వెల్లడి
  • ఐకానిక్ టవర్ల పనులను పరిశీలించిన మంత్రి నారాయణ
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు 2028 అక్టోబరు నాటికి పూర్తి చేయడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈరోజు ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించి, ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం సీఆర్‌డీఏ, ఏడీసీఎల్ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమావేశమై పనుల పురోగతిపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గత నెలలో వర్షాల కారణంగా పనులకు కొంత ఆటంకం కలిగిందని, ఇప్పుడు పనులు తిరిగి వేగం పుంజుకున్నాయని తెలిపారు. ఐకానిక్ టవర్ల నిర్మాణంలో మొదటి డయాగ్రిడ్ పూర్తయిందని, ప్రతి రెండు నెలలకు 6 అంతస్తుల నిర్మాణం పూర్తయ్యేలా లక్ష్యం నిర్దేశించామని వివరించారు. ఐకానిక్ అసెంబ్లీ, హైకోర్టు ఫౌండేషన్ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నివాస భవనాలు తుది దశకు చేరుకున్నాయని, నవంబర్ 11 తర్వాత వాటి ప్రారంభోత్సవాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాల్లో ప్రస్తుతానికి స్థానిక ఎన్నికలను పెండింగ్ లో పెడుతున్నామని తెలిపారు.

రాజధాని నిర్మాణంపై కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారని నారాయణ మండిపడ్డారు. విమర్శలు చేసేవారు అమరావతికి వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూస్తే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణ పనుల్లో 35 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. పనులను వేగవంతం చేసేందుకు ప్రతి నిర్మాణ సంస్థకు స్పష్టమైన టార్గెట్లు విధించామని పేర్కొన్నారు.

ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం ల్యాండ్ పూలింగ్ చాలా వరకు పూర్తయిందని, డిసెంబర్ నాటికి రోడ్ నెట్‌వర్క్‌కు సంబంధించి సింగపూర్ మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుందని వెల్లడించారు.
Advertisement
Narayana
Amaravati Capital Construction
Andhra Pradesh Local Elections
Land Pooling Villages
Iconic Towers Amaravati
AP CRDA Projects

More Telugu News