భారత పైలట్ స్మిత్ మచ్చర్ కోసం హనుమాన్ చాలీసా పాడిన ఇజ్రాయెల్ సింగర్.. వీడియో వైరల్!
- భారత పైలట్ కోసం హనుమాన్ చాలీసా పాడిన ఇజ్రాయెల్ సింగర్ బెన్ రైవిట్జ్
- విమానంలో సహ పైలట్ దాడి చేసినా ధైర్యంగా నిలిచిన కెప్టెన్ స్మిత్ మచ్చర్
- హనుమాన్ చాలీసా పఠిస్తూ విమానాన్ని సురక్షితంగా దించిన పైలట్
- పైలట్‌ను హీరోగా అభివర్ణిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో
విపత్కర పరిస్థితుల్లో హనుమాన్ చాలీసా పఠించి ధైర్యం తెచ్చుకున్న భారత పైలట్‌కు, ఇజ్రాయెల్‌కు చెందిన ఓ గాయకుడు అదే హనుమాన్ చాలీసాను పఠిస్తూ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి హృదయాలను గెలుచుకుంటోంది.
వివరాల్లోకి వెళితే.. ఫ్లైదుబాయ్ విమాన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఇటీవల దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు విమానం నడుపుతుండగా, కాక్‌పిట్‌లో సహ పైలట్ ఆయనపై దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే, దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ, కెప్టెన్ స్మిత్ ధైర్యం కోల్పోకుండా విమానాన్ని అదుపులో ఉంచేందుకు ప్రయత్నించారు. ఈ కష్ట సమయంలో తాను హనుమాన్ చాలీసా పఠించానని, అదే తనకు ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చిందని ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సంభాషణలో తెలిపారు.
కెప్టెన్ స్మిత్ కథకు చలించిపోయిన ఇజ్రాయెల్ గాయకుడు, భారత శాస్త్రీయ సంగీత ప్రియుడు అయిన బెన్ రైవిట్జ్, ఆయన కోసం హనుమాన్ చాలీసాను ఆలపించి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "ఎంతోమంది ప్రాణాలను కాపాడి, ఒక పెను ప్రమాదాన్ని నివారించిన భారత హీరో కెప్టెన్ స్మిత్. ఆయన త్వరగా కోలుకోవాలి" అని తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ సాంస్కృతిక సౌభ్రాతృత్వానికి నిదర్శనంగా నిలిచిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. భారత్, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నెటిజన్లు ఈ ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. ఆ రోజు కెప్టెన్ స్మిత్ విమానాన్ని సురక్షితంగా దారి మళ్లించి ల్యాండ్ చేయడంతో ప్రయాణికులెవరూ గాయపడలేదు.