నేను ఏ మతాన్ని కించపరచలేదు: ఇర్ఫాన్ పఠాన్
- వ్యూస్ కోసమే కొందరు ఇలా చేస్తున్నారన్న ఇర్ఫాన్ పఠాన్
- తన నుంచి నేరుగా వచ్చే వార్తలను నమ్మాలని సూచన
- తప్పుడు సమాచారాన్ని షేర్ చేయవద్దన్న ఇర్ఫాన్
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, తన పేరుతో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న నకిలీ వార్తలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఏ మతాన్ని కించపరిచేలా ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశాడు. కొంతమంది కేవలం వ్యూస్ కోసం, ఎలాంటి ఆధారం లేకుండా తన పేరును వాడుకుంటూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నాడు.
"నా పేరుతో ఆధారం లేకుండా, కేవలం వ్యూస్ కోసం ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. దయచేసి ఎవరూ నమ్మవద్దు, షేర్ చేయవద్దు" అని ఇర్ఫాన్ తన పోస్టులో కోరాడు. తన నుంచి అధికారికంగా సమాచారం వస్తే తప్ప, ఇతర వార్తలను విశ్వసించవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.
"నేను నా మతంతో సహా ఏ మతాన్ని కూడా ఎప్పుడూ కించపరచలేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మే ముందు లేదా ఇతరులకు పంపే ముందు వాస్తవాలను సరిచూసుకోవాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను" అని ఇర్ఫాన్ వివరించాడు. ఈ మేరకు అతడు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.