తెలంగాణ ఆడపడుచులకు సీఎం రేవంత్ బతుకమ్మ శుభాకాంక్షలు
- ప్రకృతి ఆరాధనకు, ఐక్యతకు బతుకమ్మ ప్రతీక అన్న సీఎం
- ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతుందన్న ముఖ్యమంత్రి
- బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రాష్ట్ర మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ తొమ్మిది రోజుల పూల ఉత్సవాలను మహిళలందరూ ఆనందోత్సాహాల మధ్య, సంప్రదాయ పాటలు, నృత్యాలతో ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక సందేశాన్ని విడుదల చేశారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ విశిష్ట సంస్కృతికి అద్దం పడుతుందని, ప్రకృతిని ఆరాధించే అత్యంత గొప్ప సంప్రదాయమని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, గౌరమ్మను పూజించడం తెలంగాణ జీవన విధానంలో ఒక భాగమని ఆయన పేర్కొన్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు సాగే ఈ వేడుకలు ప్రజల మధ్య ఐక్యతను, సామూహిక జీవన సౌందర్యాన్ని చాటిచెబుతాయని ఆయన కొనియాడారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తమ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ పండుగ నేడు తెలంగాణ ప్రజల జీవనశైలిలో ఒక అంతర్భాగంగా మారిపోయిందని ఆయన పేర్కొన్నారు.