రేవంత్ రెడ్డి కుటుంబం ఓ అనకొండ ఫ్యామిలీ: మన్నె క్రిశాంక్
- 817 ఎకరాల ప్రభుత్వ భూమి తాకట్టు పెట్టి రూ.12,818 కోట్ల రుణం తీసుకున్నారన్న క్రిశాంక్
- భూముల విలువ తగ్గించి రుణాలు పొందారంటూ ఆరోపణ
- తెలంగాణ సంపద కోసం పోరాడుతూనే ఉంటానని వెల్లడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం తెలంగాణలో అక్రమాస్తులు కూడగడుతూ 'అనకొండ ఫ్యామిలీ'గా మారిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై సంచలన విమర్శలు చేశారు.
హైదరాబాద్లోని ఇజ్జత్ నగర్, మోకిల, మియాపూర్, ఇంజాపూర్, చిలుకూరు, పటాన్చెరు, గాజులరామారం, జవహర్ నగర్ వంటి అత్యంత విలువైన ప్రాంతాల్లోని 817 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి రూ.12,818 కోట్లకు పైగా రుణాలు సమీకరించారని ఆయన ఆరోపించారు. ఈ భూముల మార్కెట్ విలువ ఎకరానికి రూ.150 కోట్లకు పైగా ఉండగా, కేవలం రూ.15 కోట్లుగా చూపించి రుణాలు పొందారని విమర్శించారు. తాకట్టు పెట్టిన భూమిలో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ ఎలా కంటైనర్లను ఏర్పాటు చేసిందని ఆయన ప్రశ్నించారు.
తాను అక్రమాస్తులపై ప్రశ్నిస్తుంటే నిజం బయటపడుతుందన్న భయంతోనే ముఖ్యమంత్రి, ఆయన బృందం స్పందించడం లేదని క్రిశాంక్ అన్నారు. తాను వ్యక్తిగత ఆస్తుల గురించి కాకుండా, తెలంగాణ సంపద గురించే ప్రశ్నిస్తున్నానని, ఎన్ని బెదిరింపులు వచ్చినా రాష్ట్ర వనరుల పరిరక్షణకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.