బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుపై చంద్రబాబు స్పందన
Add ap7am to your home Screen

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుపై చంద్రబాబు స్పందన

Chandrababu Naidu responds to Supreme Court verdict on BC reservations
  • స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత
  • 50 శాతం రిజర్వేషన్ల పరిమితి దాటరాదన్న హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
  • కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా బీసీలకు అండగా ఉంటామన్న చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదంటూ గతంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సమర్థించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం కోటా 50 శాతం మించకూడదన్న నిబంధనను హైకోర్టు గుర్తుచేయడం సమంజసమేనని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.

సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. న్యాయస్థానాల తీర్పులు ఎలా ఉన్నప్పటికీ, తమ కూటమి ప్రభుత్వం బీసీలకు పూర్తిస్థాయిలో రాజకీయంగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు పార్టీ తరఫున అధిక శాతం సీట్లు కేటాయించి, వారి రాజకీయ ప్రాధాన్యాన్ని కాపాడతామని స్పష్టం చేశారు. బీసీలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కడాన్ని వైసీపీ సహించలేకపోయిందని చంద్రబాబు ఆరోపించారు. అందుకే కోర్టులకు వెళ్లి, బీసీల రాజకీయ వాటాను అడ్డుకునేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీల కోటాను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడం వల్ల బీసీలు సుమారు 16,800 పదవులు కోల్పోయారని ఆయన గుర్తుచేశారు.
Advertisement
Chandrababu Naidu
BC Reservation
Supreme Court
Andhra Pradesh Local Body Elections
BC Quota Limit
YSRCP

More Telugu News