పోర్టుల అభివృద్ధికి 20 వేల ఎకరాలివ్వండి: కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
- పోర్టుల అభివృద్ధికి 20,378 ఎకరాల ఉప్పు భూములు కేటాయించాలని విజ్ఞప్తి
- ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
- పోర్టు ఆధారిత పారిశ్రామిక అభివృద్ధికి ఈ భూములు కీలకమని వెల్లడి
- మిర్చి, పొగాకు వంటి వాణిజ్య పంటల ఎగుమతులకు సహకరించాలని కేంద్రానికి మరో వినతి
ఆంధ్రప్రదేశ్‌లో పోర్టు ఆధారిత పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని సుమారు 20,378 ఎకరాల ఉప్పు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురోభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (DPIIT) పరిధిలో ఉన్న ఉప్పు భూములను రాష్ట్రానికి కేటాయించడం ద్వారా పోర్టుల విస్తరణ, అనుబంధ మౌలిక సదుపాయాల కల్పన సులభతరం అవుతుందని ముఖ్యమంత్రి వివరించారు. పోర్టు ఆధారిత పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం ఈ భూములను వినియోగించుకోవడానికి వీలుగా బదలాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. పోర్టులకు అవసరమైన కనెక్టివిటీ రోడ్లు, రైల్వే లైన్లు, ఇతర పారిశ్రామిక కార్యకలాపాలకు ఈ భూములు అత్యంత కీలకమని, దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపామని ఆయన గుర్తుచేశారు.
వాణిజ్య పంటలకు మార్కెట్ కల్పించండి
ఇదే సమావేశంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలపైనా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులు పండిస్తున్న మిర్చి, పొగాకు, ఆక్వా వంటి వాణిజ్య ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో విశేషమైన ఆదరణ ఉందని, వాటి ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ తగిన సహకారం అందించాలని కోరారు. ఈ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ అవకాశాలను కల్పించడంతో పాటు, నాణ్యతా ప్రమాణాల పెంపుదల, ప్రాసెసింగ్ సదుపాయాలు బలోపేతానికి కేంద్రం చేయూతనివ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థనలపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.