ఉద్యోగులకు లక్షల ఖరీదు చేసే బీఎండబ్ల్యూ కార్లు గిఫ్ట్‌గా ఇచ్చిన యజమాని
Add ap7am to your home Screen

ఉద్యోగులకు లక్షల ఖరీదు చేసే బీఎండబ్ల్యూ కార్లు గిఫ్ట్‌గా ఇచ్చిన యజమాని

Ma Yanli gifts BMW cars worth lakhs to her employees
  • చైనాలో ఉద్యోగులకు బీఎండబ్ల్యూ కార్లు బహుమతిగా ఇచ్చిన ఓనర్
  • సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారనే ఈ నిర్ణయం
  • చలి, వానలో ప్రయాణిస్తుండటం చూసి చలించిన యజమాని
  • మీటింగ్ అని చెప్పి షోరూంకు తీసుకెళ్లి సర్‌ప్రైజ్
  • సోషల్ మీడియాలో మహిళా వ్యాపారిపై ప్రశంసల వర్షం
చైనాలో ఓ రెస్టారెంట్ యజమాని తన ఉద్యోగుల పట్ల చూపిన ఉదారత ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. తన సిబ్బంది రోజూ విధులకు హాజరు కావడానికి పడుతున్న ఇబ్బందులను చూసి చలించిన ఆమె, కష్టపడి పనిచేసే కొందరు ఉద్యోగులకు సరికొత్త బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు.

మధ్య చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో మా యన్లీ అనే మహిళ బీఫ్ హాట్‌పాట్ రెస్టారెంట్ చైన్ నడుపుతున్నారు. తన ఉద్యోగులు చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్లపై చలి, వాన, గాలులను తట్టుకుంటూ పనికి రావడం ఆమె గమనించారు. వారి కష్టాన్ని చూసి, వారికి మెరుగైన సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 24న, కొందరు ఉద్యోగులను మీటింగ్ ఉందని చెప్పి ఓ బీఎండబ్ల్యూ షోరూంకు తీసుకెళ్లారు. అక్కడ వారికి కార్లను బహుమతిగా ఇస్తున్నట్లు చెప్పి సర్‌ప్రైజ్ చేశారు.

ఒక్కో కారు విలువ సుమారు 3 లక్షల యువాన్లు (సుమారు రూ. 43 లక్షలు) వరకు ఉంటుంది. రెండు వారాల ముందే యన్లీ ఈ కార్లను పూర్తిగా డబ్బు చెల్లించి కొనుగోలు చేశారు. దీంతో ఉద్యోగులు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకుండానే కార్లను సొంతం చేసుకున్నారు.

కారు అందుకున్న ఉద్యోగుల్లో ఒకరైన లీ జీ తన ఆనందాన్ని పంచుకుంటూ, "ఇది నేను కలలో కూడా ఊహించలేదు. షోరూంకు వెళ్లే దారిలో యజమాని నాకు ఓ పెద్ద బొమ్మ కొనిస్తానని చెప్పారు" అని తెలిపారు. తన సిబ్బంది సమష్టి కృషితోనే వ్యాపారం అభివృద్ధి చెందిందని, అందుకే కంపెనీ విజయ ఫలాలను వారితో పంచుకోవాలని భావించినట్లు యన్లీ వివరించారు. ఈ అసాధారణ బహుమతి నెట్టింట వైరల్ అవ్వగా, ఆమె మంచి మనసును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Advertisement
Ma Yanli
BMW car gift
China restaurant owner
Employee rewards
Henan beef hotpot
Luxury car surprise

More Telugu News