కెప్టెన్‌ స్మిత్‌ను స్వయంగా వెళ్లి పరామర్శించిన దుబాయ్‌ యువరాజు
Advertisement

కెప్టెన్‌ స్మిత్‌ను స్వయంగా వెళ్లి పరామర్శించిన దుబాయ్‌ యువరాజు

Captain Smith Macher visited by Dubai Prince after saving 174 passengers
  • స్మిత్‌ను ఆస్పత్రిలో కలిసిన దుబాయ్‌ యువరాజు
  • ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న హమ్దాన్‌
  • స్మిత్‌ ధైర్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించిన యువరాజు
  • స్మిత్‌తో ఫొటోలను పంచుకున్న యువరాజు
  • స్మిత్‌ను చూసి యూఏఈ గర్విస్తోందని వ్యాఖ్య
ప్రాణాలను లెక్కచేయకుండా విమానంలోని 174 మందిని కాపాడిన భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ను దుబాయ్‌ యువరాజు షేక్‌ హమ్దాన్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ స్వయంగా వెళ్లి పరామర్శించారు. దుబాయ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్‌ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

స్మిత్‌ను కలిసిన అనంతరం యువరాజు ఆయన ధైర్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. స్మిత్‌పై తమకు పూర్తి గౌరవం, అభిమానం ఉన్నాయని తెలిపారు. యూఏఈ నాయకత్వం కూడా ఆయనను గర్వంగా చూస్తోందని చెప్పారు.

స్మిత్‌ యూఏఈ విలువలకు ప్రతీకగా నిలిచారని యువరాజు పేర్కొన్నారు. దయ, శాంతి, మానవ ప్రాణాలకు విలువ ఇచ్చే దేశంగా యూఏఈ నిలుస్తుందని చెప్పారు. స్మిత్‌తో మాట్లాడుతున్న ఫొటోలను యువరాజు సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు కూడా అందులో కనిపించాయి.

విమానంలో సహ పైలట్‌ దాడి చేయడంతో స్మిత్‌ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన సహ పైలట్‌ను అడ్డుకునేందుకు ఆయన గాయాలతో వీరోచితంగా పోరాడారు. అనంతరం కాక్‌పిట్‌ తలుపు తెరవడంతో ప్రయాణికులు లోపలికి వెళ్లి దాడిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనలో విమానంలోని 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడటంలో స్మిత్‌ కీలక పాత్ర పోషించారు. తీవ్ర గాయాల మధ్య కూడా ఆయన చూపిన ధైర్యంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి.
Advertisement
Captain Smith Macher
Sheikh Hamdan bin Mohammed
Dubai Crown Prince
Indian pilot hero
Dubai hospital visit
Flight 174 passengers saved

More Telugu News