టాటా సన్స్ ను లిస్టింగ్ నుంచి తప్పించేందుకు టాటా ట్రస్ట్స్ కొత్త ఎత్తుగడ!
- టాటా సన్స్ లిస్టింగ్ నివారణకు టాటా ట్రస్ట్స్ ప్రతిపాదన
- టాటా సన్స్‌లో రెండు కంపెనీల విలీనానికి ప్లాన్
- ఆపరేటింగ్ కంపెనీగా మారి నిబంధనల నుంచి మినహాయింపు
- టాటా సన్స్ బోర్డు పరిశీలనకు చేరిన ప్రతిపాదన
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయకుండా నివారించేందుకు, అందులో 66 శాతం మెజారిటీ వాటా కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్ ఒక కీలక ప్రతిపాదనను సిద్ధం చేసింది. టాటా సన్స్ నిర్మాణాన్ని పునర్‌వ్యవస్థీకరించడం ద్వారా, లిస్టింగ్ తప్పనిసరి చేసే నిబంధనల నుంచి మినహాయింపు పొందాలని టాటా ట్రస్ట్స్ భావిస్తోంది.
ఈ ప్రతిపాదన ప్రకారం, టాటా గ్రూప్‌కు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఈఎస్ఎస్), టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ (టీసీఈ) అనే రెండు ఆపరేటింగ్ కంపెనీలను టాటా సన్స్‌లో విలీనం చేయనున్నారు. ఈ విలీనం పూర్తయితే టాటా సన్స్ కేవలం పెట్టుబడుల సంస్థగా మాత్రమే కాకుండా, ప్రత్యక్షంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే 'ఆపరేటింగ్ కంపెనీ'గా రూపాంతరం చెందుతుంది. తద్వారా, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) లేదా కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (సీఐసీ)లకు వర్తించే కఠిన నిబంధనల పరిధి నుంచి టాటా సన్స్‌కు ఊరట లభిస్తుంది.
టాటా సన్స్‌ను ఒక ప్రైవేట్ అన్‌లిస్టెడ్ కంపెనీగానే కొనసాగించాలన్నది టాటా ట్రస్ట్స్ ప్రధాన ఉద్దేశం. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా సైతం లిస్టింగ్ ప్రక్రియను గతంలోనే పలుమార్లు వ్యతిరేకించారు. 2004లో టీసీఎస్‌ను ప్రత్యేక సంస్థగా విభజించడానికి ముందు, టాటా సన్స్ స్వయంగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తూ ఆదాయాన్ని ఆర్జించేది. ఇప్పుడు తిరిగి అదే తరహా విధానాన్ని పునరుద్ధరించాలని ట్రస్టులు యోచిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ప్రతిపాదన టాటా సన్స్ బోర్డు పరిశీలనలో ఉంది. ఈ విలీన ప్రక్రియను పట్టాలెక్కించేందుకు ముందుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) పొందడం తప్పనిసరి.