ఆ సౌండ్ హనుమాన్ టెంపుల్ లో కాదు.. శిరీష్ ఫిర్యాదుపై పోలీసుల క్లారిటీ!

ఆ సౌండ్ హనుమాన్ టెంపుల్ లో కాదు.. శిరీష్ ఫిర్యాదుపై పోలీసుల క్లారిటీ!

Allu Sirish complaint on DJ sound Cyberabad Police clarifies it was not Hanuman Temple
  • డీజే సౌండ్‌పై అల్లు శిరీష్ ఫిర్యాదుపై పోలీసుల స్పందన
  • అది హనుమాన్ ఆలయం కాదని స్పష్టత
  • గణేశ్ నిమజ్జనం కార్యక్రమం వల్లే శబ్దాలు అని వెల్లడి
  • విమర్శల నేపథ్యంలో పోలీసుల వివరణతో వివాదానికి తెర
హీరో అల్లు శిరీష్ చేసిన డీజే సౌండ్ ఫిర్యాదుపై సైబరాబాద్ పోలీసులు స్పందించారు. అర్ధరాత్రి వరకు భారీ శబ్ధాలతో ఇబ్బంది కలుగుతోందంటూ శిరీష్ చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, ఆ శబ్దాలకు హనుమాన్ ఆలయానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఈ విషయమై అల్లు శిరీష్‌తో మాట్లాడినట్లు పోలీసులు వెల్లడించారు. సదరు శబ్దాలు గణేశ్ నిమజ్జనం ఊరేగింపు నుంచి వచ్చాయని, హనుమాన్ ఆలయం నుంచి కాదని వివరించారు. కార్యక్రమ నిర్వాహకులతో కూడా చర్చించామని, ఇప్పటికే నిమజ్జనం పూర్తయిందని వారు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.

కొన్ని రోజుల క్రితం, తన నివాసం సమీపంలోని ఒక హనుమాన్ ఆలయం వద్ద అర్ధరాత్రి వరకు డీజే సౌండ్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారంటూ అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు లోతుగా విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించారు. పోలీసుల తాజా వివరణతో ఈ వివాదానికి తెరపడినట్లయింది.
Advertisement
Allu Sirish
Cyberabad Police
DJ Sound Complaint
Ganesh Nimajjanam
Hanuman Temple
Hyderabad News

More Telugu News