‘ది ప్యారడైజ్’ చూసిన కేటీఆర్.. ‘ఆ డైలాగ్ చెప్పిందెవరో మీకు తెలుసుగా?’ అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్‌!

‘ది ప్యారడైజ్’ చూసిన కేటీఆర్.. ‘ఆ డైలాగ్ చెప్పిందెవరో మీకు తెలుసుగా?’ అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్‌!

KTR watches The Paradise and asks who said that famous dialogue
  • బీఆర్ఎస్ నేతలతో కలిసి ‘ది ప్యారడైజ్’ చూసిన కేటీఆర్
  • దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నటుడు నానిపై ప్రశంసల వర్షం
  • కేసీఆర్‌ను పోలిన పాత్రధారి ప్రియదర్శికి ప్రత్యేక అభినందనలు
  • సినిమాలోని ఓ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నాని హీరోగా వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయన, సినిమాలోని ఓ పవర్‌ఫుల్ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ ‘అదే ఎవరో మీకు తెలుసు’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సినిమా చూసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు అభినందనలు తెలిపారు. అస్తిత్వం కోసం ఆరాటం, అణిచివేతపై పోరాటాన్ని సినిమాలో బలంగా చూపించారని ప్రశంసించారు. హీరో నాని తన మిత్రుడని, కథానాయకుడి పాత్రలో జీవించారని కొనియాడారు. సందర్భం వచ్చినప్పుడు గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారతాయనే సందేశం బాగుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ను పోలిన పాత్రలో నటించిన ప్రియదర్శికి కేటీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘చావు నోట్లో తల పెట్టయినా... మీకు గుర్తింపు తెస్తా!!’ అనే డైలాగ్‌ను గుర్తుచేస్తూ.. ‘ఆ డైలాగ్ చెప్పింది ఎవరో మీకు తెలుసు కదా’ అని వ్యాఖ్యానించారు. 

నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రం అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం నేపథ్యంలో రూపొందింది. సినిమాలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్ర ఉండటంతో విడుదలకు ముందే బీఆర్ఎస్ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే.
Advertisement
KTR
The Paradise movie
Actor Nani
Srikanth Odela
BRS Party
KCR dialogue

More Telugu News