మూడు గోల్ఫ్ బంతులు మింగేసిన పాము.. ఆపరేషన్ లేకుండానే కాపాడిన వైద్యులు.. ఇదిగో వీడియో!

మూడు గోల్ఫ్ బంతులు మింగేసిన పాము.. ఆపరేషన్ లేకుండానే కాపాడిన వైద్యులు.. ఇదిగో వీడియో!

Snake swallows three golf balls doctors save it without surgery video
  • టెక్సాస్‌లో చికిత్స అందించిన పశువైద్యులు
  • ఆపరేషన్ లేకుండానే బంతులను బయటకు తీసిన వైనం
  • పాముకు అధిక మోతాదులో మత్తు ఇచ్చి చికిత్స పూర్తి చేసిన వైద్యులు
  • ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట‌ వైరల్
అమెరికాలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ఓ పాము మూడు గోల్ఫ్ బంతులను మింగేయగా, పశువైద్యులు ఆపరేషన్ లేకుండానే వాటిని సురక్షితంగా బయటకు తీశారు. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ఈ సంఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ఓ పాము కడుపులో గోల్ఫ్ బంతులు ఇరుక్కుపోయి ఉండటంతో దానిని సౌత్ టెక్సాస్ ఏవియన్ అండ్ ఎగ్సాటిక్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. పామును పరీక్షించిన వైద్యులు, దానికి అధిక మోతాదులో మత్తు ఇచ్చారు. 

అనంతరం దాని శరీరం లోపల ఇరుక్కుపోయిన మూడు బంతులను వైద్య బృందం నెమ్మదిగా చేతులతోనే నెట్టుకుంటూ నోటి వైపునకు తీసుకొచ్చింది.

ఒక్కో బంతి నోటి వద్దకు రాగానే, పాము నోరు తెరుచుకోవడంతో వైద్యులు సులభంగా వాటిని బయటకు తీశారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని సర్జరీ లేకుండానే విజయవంతంగా పూర్తి చేశారు. ఇది తమకు ఎప్పటికీ గుర్తుండిపోయే కేసు అని, అరుదైన జంతువులకు వైద్యం చేసేటప్పుడు ఇలాంటి ఊహించని కేసులు ఎదురవుతుంటాయని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. 

ఈ చికిత్సకు సంబంధించిన వీడియోను హాస్పిటల్ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోగా, అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.
Advertisement
Snake
Golf balls
Texas veterinarians
San Antonio
South Texas Avian and Exotic Hospital
Viral snake video

More Telugu News