హైదరాబాద్‌లో నకిలీ వైద్యుడి అరెస్ట్.. లైంగిక సమస్యలకు కూడా వైద్యం!
- గోల్కొండలో నకిలీ వైద్యుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- ఇంటర్ అర్హతతోనే రోగులకు వైద్యం అందిస్తున్న వైనం
- తల్లి, సోదరుడితో కలిసి క్లినిక్ నిర్వహిస్తున్న యువకుడు
- లేబుల్స్ లేని మందులు ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం
- సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ అమాయకులను ఆకర్షిస్తున్నట్లు గుర్తింపు
హైదరాబాద్ నగరంలోని గోల్కొండలో వైద్య విద్యార్హత లేకుండా క్లినిక్ నిర్వహిస్తూ, నకిలీ డాక్టర్‌గా చలామణి అవుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్మీడియట్ మాత్రమే చదివిన 23 ఏళ్ల అద్నాన్, తన కుటుంబ సభ్యులతో కలిసి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తమ కథనంలో వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. గోల్కొండ ప్రాంతంలో అద్నాన్ అనే యువకుడు ‘హిక్మా సెహత్ కేర్ సెంటర్’ పేరుతో ఓ క్లినిక్‌ను నడుపుతున్నాడు. కేవలం ఇంటర్ (2018-2020) మాత్రమే పూర్తి చేసిన ఇతను, తన తల్లి సబా ఖాన్ (అలియాస్ మహమ్మది బేగం), సోదరుడు మహ్మద్ ఫైజాన్‌తో కలిసి తమను తాము వంశపారంపర్య హకీంలుగా (సాంప్రదాయ వైద్యులు) పరిచయం చేసుకున్నారు. లైంగిక సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఛాతీ నొప్పి, కిడ్నీ సంబంధిత నొప్పులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు వీరు చికిత్స అందిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రోగులకు ప్రిస్క్రిప్షన్లు ఇవ్వడమే కాకుండా, ఎలాంటి లేబుల్స్ లేని, కేవలం మార్కర్‌తో కోడ్‌లు రాసిన మందులను ఇస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని పోలీసులు తెలిపారు.
విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. అద్నాన్ 2023లో బీయూఎంఎస్ (యునాని) పూర్తి చేసిన డాక్టర్ మునార్వా బేగంతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెకు నెలకు రూ.13,000 చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకుని, ఆమె పేరు మీద క్లినిక్‌ను నడపడం ప్రారంభించాడు. డాక్టర్ మునార్వా బేగం అప్పుడప్పుడు మాత్రమే క్లినిక్‌కు వచ్చి వెళ్తుండగా, అద్నాన్, అతని కుటుంబ సభ్యులే పూర్తిస్థాయిలో రోగులకు చికిత్స చేసేవారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, 'సాచ్ న్యూస్' వంటి మాధ్యమాల్లో తమ క్లినిక్‌కు విపరీతంగా ప్రచారం చేసుకుంటూ అమాయకులను ఆకర్షించేవారని పోలీసులు వివరించారు.
క్లినిక్‌పై దాడి చేసిన పోలీసులు, పెద్ద మొత్తంలో లేబుల్స్ లేని మందుల పొట్లాలు, బాటిళ్లు, ప్రిస్క్రిప్షన్ పుస్తకాలు, ఫేస్‌బుక్ పేజీకి సంబంధించిన మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అద్నాన్‌ను అరెస్ట్ చేయగా, అతని తల్లి సబా ఖాన్, సోదరుడు ఫైజాన్ పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. వారి కోసం గాలిస్తున్నామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.