వెండితెరపై చందమామలాంటి అందం .. కయాదు లోహర్!
- కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కయాదు లోహర్
- గ్లామరస్ బ్యూటీగా యూత్ లో క్రేజ్
- తెలుగు నుంచి పలకరించని సక్సెస్ లు
- కోలీవుడ్ లో పెరుగుతున్న అవకాశాలు
- టాలీవుడ్ పై కూడా దృష్టిపెట్టిన సుందరి
వెండితెరపై విరిసిన కలువనే 'కయాదు లోహర్' అనేది కుర్రాళ్లు చెప్పుకునే మాట. తమన్నా తరువాత 'మిల్కీ బ్యూటీ' అనే మాట ఏ హీరోయిన్ విషయంలో వాడొచ్చునా అనే ప్రశ్నకి ఆన్సర్ గా కనిపించే రూపమే కయాదు లోహర్. తమన్నాతో పోటీపడే మేనిఛాయతో ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి, అభిమానులను పెద్ద సంఖ్యలో సంపాదించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. చక్కని కనుముక్కుతీరుతో పాటు అందుకు తగిన అభినయంతో ఈ బ్యూటీ ఆకట్టుకుంటూ వెళుతోంది. వరుస సినిమాలతో మరింత బిజీ అవుతోంది.
సాధారణంగా ఒక భాషలో బిజీ అయిన తరువాతనే హీరోయిన్స్ మరో భాషలోకి ఎంట్రీ ఇస్తుంటారు. అలా కాకుండా వరుసగా వివిధ భాషల్లో అవకాశాలను సంపాదించుకోవడం చాలా తక్కువ మంది హీరోయిన్స్ విషయంలో జరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక అరుదైన ఫీట్ కయాదు లోహర్ కూడా సాధ్యం చేసింది. కన్నడ సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టిన ఈ చందమామ లాంటి అమ్మాయి, తెలుగు .. తమిళ .. మలయాళ .. మరాఠీ భాషలకు పరిచయం కావడానికి ఎక్కువ సమయం తీసుకోకపోవడం విశేషం.
తన కెరియర్ ఆరంభంలోనే తెలుగులో శ్రీవిష్ణుతో 'అల్లూరి' .. విష్వక్సేన్ తో 'ఫంకీ' చేసిన 'కయాదు లోహర్'కి ఆ సినిమాలు సరిగ్గా ఆడక పోవడం వలన సరైన గుర్తింపురాలేదు. ఆ తరువాతనే యూత్ లో ఆమె క్రేజ్ పెరుగుతూ వెళ్లింది. ఇప్పుడు తమిళ .. మలయాళ ప్రాజెక్టులతో ఆమె ఫుల్ బిజీ. ఈ నేపథ్యంలోనే తెలుగులో ఆమె చేసిన మరో సినిమాగా 'ది ప్యారడైజ్' నిన్న థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాలో కనిపించినంత సేపు తన అందంతో ఆమె ఆకట్టుకుంది. కాకపోతే ఆమె పాత్రకి సరైన ప్రాధాన్యత లేకపోవడం అభిమానులకు అసంతృప్తిని కలిగించింది. కయాదు గ్లామర్ కి తగిన సరైన ప్రాజెక్టులు .. పాత్రలు పడితే, తెలుగులోను ఆమె బిజీ కావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఆ రోజు త్వరలోనే వస్తుందేమో చూడాలి మరి.