క్లాస్‌లో కండోమ్‌ పాఠాలు.. దోసకాయతో ప్రయోగం.. బీహార్ టీచర్ వీడియో వైరల్!

క్లాస్‌లో కండోమ్‌ పాఠాలు.. దోసకాయతో ప్రయోగం.. బీహార్ టీచర్ వీడియో వైరల్!

Condom lessons in class experiment with cucumber Bihar teacher video viral
  • బీహార్‌లో బయాలజీ టీచర్ వినూత్న ప్రయోగం
  • కీరా దోసకాయ, కండోమ్‌తో సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలు
  • కండోమ్ వాడకంపై విద్యార్థులకు ప్రాక్టికల్ డెమో
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై మిశ్రమ స్పందన
బీహార్‌లోని పూర్నియాకు చెందిన ఓ బయాలజీ టీచర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. తరగతి గదిలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి వివరిస్తూ.. కీరా దోసకాయ, కండోమ్‌ను ఉపయోగించి ప్రాక్టికల్‌గా పాఠం చెప్పడమే ఇందుకు కారణం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

చందన్ కుమార్ పండిత్ అనే ఈ టీచర్, తనను తాను ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఇండియాస్ వైరల్ బయాలజీ సర్'గా పరిచయం చేసుకున్నారు. ఇటీవల ఆయన పోస్ట్ చేసిన ఓ చిన్న వీడియోలో.. కండోమ్‌ను ఎలా సరిగ్గా ఉపయోగించాలో చెప్పేందుకు కీరా దోసకాయను మోడల్‌గా వాడారు. లైంగికంగా సంక్రమించే వ్యాధుల నివారణ, జనన నియంత్రణలో కండోమ్‌ల పాత్ర గురించి కూడా ఆయన విద్యార్థులకు వివరించారు.

పుస్తకాల్లోని చదువుతో పాటు ఇలాంటి సున్నితమైన అంశాలపై ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రాక్టికల్ అవగాహన కల్పించడం ఎంతో అవసరమని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో పోస్ట్ అయిన కొద్ది సమయంలోనే లక్షలాది వ్యూస్ సాధించింది. 

టీచర్ చెప్పిన విధానాన్ని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తూ, ఇలాంటి ప్రాక్టికల్ విధానం అవసరమని కామెంట్లు చేశారు. అయితే, పునరుత్పత్తి ఆరోగ్యంపై తరగతి గదిలో బోధించే పద్ధతులపై ఈ వీడియో కొత్త చర్చకు దారితీసింది.
Advertisement
Chandan Kumar Pandit
Bihar Biology Teacher
Sex Education India
Viral Biology Teacher Video
Condom Awareness Lesson
Purnia Bihar News

More Telugu News