నిలబడే నిద్రించగల సామర్థ్యం ఉన్న జంతువులు, పక్షులు ఏవో తెలుసా?

నిలబడే నిద్రించగల సామర్థ్యం ఉన్న జంతువులు, పక్షులు ఏవో తెలుసా?

Do you know which animals can sleep while standing
  • అప్పుడప్పుడు నిలబడే కునుకు తీసే ఏనుగులు
  • ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు నిలబడే విశ్రాంతి తీసుకునే జిరాఫీలు
  • కొమ్మను గట్టిగా పట్టుకుని నిద్రించే మైనాలు, పావురాలు
  • ఒంటికాలిపై నిలబడి నిద్రించగలిగే ఫ్లెమింగోలు
  • గుర్రాలలో నిలబడి నిద్రించేందుకు ప్రత్యేక వ్యవస్థ
మనుషులకు నిద్ర అంటే హాయిగా మంచంపై పడుకోవడం. కానీ జంతు ప్రపంచంలో నిద్రకు లెక్కలేనన్ని పద్ధతులు ఉన్నాయి. కొన్ని ఏకంగా నిలబడే నిద్రపోతాయి. మరికొన్ని పక్షులు కొమ్మపై కూర్చొనే నిద్రలోకి జారుకుంటాయి. ఇలా నిలబడే స్థితిలోనే విశ్రాంతి తీసుకునే ఏడు జంతువుల గురించి తెలుసుకుందాం..

ఏనుగులు
భారీ శరీరంతో కనిపించే ఏనుగులు అప్పుడప్పుడు నిలబడే చిన్న కునుకు తీస్తాయి. ఇలా చేయడం వల్ల నేలపై పడుకొని మళ్లీ లేవాల్సిన అవసరం ఉండదు. అయితే గాఢమైన నిద్ర కోసం మాత్రం అవి నేలపై పడుకుంటాయి.

జిరాఫీలు
పొడవాటి కాళ్లు, మెడతో ఉండే జిరాఫీలకు నేలపైకి కూర్చొని మళ్లీ లేవడం అంత సులభం కాదు. అందుకే కొన్ని సందర్భాల్లో నిలబడే విశ్రాంతి తీసుకుంటాయి. ప్రమాదం ఎదురైతే వెంటనే కదలడానికి ఇది ఉపయోగపడుతుంది.

మైనాలు, పావురాలు
ఈ పక్షుల కాళ్లలో అద్భుతమైన ప్రత్యేకత ఉంది. కొమ్మపై వాలగానే వాటి వేళ్లు కొమ్మను గట్టిగా పట్టుకుంటాయి. దీంతో నిద్రలో ఉన్నా కిందపడిపోవు. ఎత్తులో ఉండటం వల్ల కొన్ని మాంసాహార జంతువుల నుంచి రక్షణ కూడా లభిస్తుంది.

ఫ్లెమింగోలు
ఒంటికాలిపై నిలబడి నిద్రించే ఫ్లెమింగోలు చూపరులను ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యంగా నీటిలో నిల్చున్నప్పుడు ఒంటికాలిపై ఉండటం వల్ల శరీర ఉష్ణాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. వాటి కాళ్ల నిర్మాణం ఈ భంగిమలో ఎక్కువ శ్రమ లేకుండా నిలబడేలా చేస్తుంది.

జీబ్రాలు
అడవిలో సింహాల వంటి వేటాడే జంతువుల నుంచి ఎప్పుడూ ప్రమాదం ఉంటుంది. అందుకే జీబ్రాలు నిలబడే విశ్రాంతి తీసుకుంటాయి. దీనివల్ల ప్రమాదం కనిపించిన వెంటనే పరుగెత్తేందుకు వీలుగా ఉంటుంది. వాటి కాళ్ల ప్రత్యేక నిర్మాణం శరీరాన్ని ఎక్కువ కండరాల శ్రమ లేకుండా మోయగలదు.

ఆవులు
ఆవులు కూడా నిలబడే విశ్రాంతి తీసుకోగలవు. ముఖ్యంగా బయట ఉన్నప్పుడు పరిసరాలను గమనిస్తూ కొంతసేపు అలా ఉండిపోతాయి. అయితే ఎక్కువసేపు నిద్రించడానికి నేలపై పడుకుంటాయి.

గుర్రాలు
నిలబడే నిద్రకు గుర్రాలు ప్రసిద్ధి. వాటి కాళ్లలో ఉండే ‘స్టే అపరేటస్‌’ వ్యవస్థ కీళ్లను స్థిరంగా ఉంచుతుంది. దీంతో ఎక్కువ కండరాల శక్తి అవసరం లేకుండానే నిలబడగలవు. అడవిలో ప్రమాదం ఎదురైతే వెంటనే పరుగెత్తేందుకు ఈ సామర్థ్యం ఎంతో ఉపయోగపడుతుంది.
Advertisement
Animals
Sleeping habits
Standing sleep
Wildlife facts
Horses
Nature

More Telugu News