'క్లాడ్' సాయంతో 'ఓపెన్ఏఐ'ని హ్యాక్ చేశారు.. ముగ్గురూ భారతీయులే.. అందులో ఒకరు ఆంధ్రా టెక్కీ!
- ఓపెన్ఏఐ సిస్టమ్‌లో లోపాలను గుర్తించిన భారత సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు
- ఈ బృందంలో ఏపీకి చెందిన టెక్కీ మోహన్ పెదపాటి కీలక సభ్యుడు
- లోపాలను ఛేదించేందుకు పోటీ సంస్థ అభివృద్ధి చేసిన 'క్లాడ్' ఏఐని వినియోగం
- ఇది అధీకృత పరీక్షేనని స్పష్టం చేసిన నిపుణులు, ఓపెన్ఏఐ నుంచి రూ. 5.5 లక్షల బహుమతి
చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థకు భారత సైబర్ సెక్యూరిటీ నిపుణులు షాక్ ఇచ్చారు. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక టెక్కీతో కూడిన బృందం ఈ ఘనత సాధించడం విశేషం. ఓపెన్ఏఐకి పోటీగా ఉన్న మరో ఏఐ 'క్లాడ్' సహాయంతో ఆ సంస్థ సిస్టమ్‌లోని కీలక లోపాలను గుర్తించారు. ఈ పరిశోధన ద్వారా వారు రూ. 5.5 లక్షల బగ్ బౌంటీని కూడా గెలుచుకున్నారు.
హ్యాక్‌ట్రాన్ ఏఐ అనే సంస్థకు చెందిన హర్ష్ జైస్వాల్, రాహుల్ మైనీ, ఏపీకి చెందిన మోహన్ పెదపాటి ఈ పరిశోధన చేశారు. ఓపెన్ఏఐ అధికారికంగా నిర్వహించిన బగ్ బౌంటీ కార్యక్రమంలో భాగంగా వారు ఈ పరీక్షలు చేపట్టారు. ఓపెన్ఏఐ కమ్యూనిటీ ఫోరమ్‌లో ఇమేజ్ ఫైల్స్ హ్యాండిల్ చేసే విధానంలో ఒక లోపాన్ని గుర్తించారు. ఈ లోపాన్ని ఉపయోగించుకుని సర్వర్‌పై పూర్తి నియంత్రణ సాధించే కోడ్‌ను అభివృద్ధి చేయడానికి, దాన్ని డీబగ్ చేయడానికి వారు 'క్లాడ్' ఏఐని ఉపయోగించుకున్నారు. ఇది వారి పనిని చాలా వేగవంతం చేసింది.
కేవలం ఫోరమ్‌తో ఆగకుండా, వారు లాగిన్ టోకెన్లలో ఉన్న మరో బలహీనతను అదునుగా చేసుకున్నారు. దీని ద్వారా ఓపెన్ఏఐ ఉద్యోగుల ఖాతాలను యాక్సెస్ చేసి, ఆపై కంపెనీకి చెందిన ప్రైవేట్ గిట్‌హబ్ ఎన్విరాన్‌మెంట్‌లోకి ప్రవేశించారు. ఈ మొత్తం ప్రక్రియను 72 గంటలలోపే పూర్తి చేయడం గమనార్హం. ఇందుకోసం వారు ఏఐ టోకెన్ల కోసం సుమారు రూ. 2.5 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు.
ఈ బృందంలోని మోహన్ పెదపాటి ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తి చేశారు. ఇది చట్టబద్ధంగా, ఓపెన్ఏఐ అనుమతితో చేసిన భద్రతా పరీక్షే తప్ప, హానికరమైన హ్యాకింగ్ కాదని నిపుణులు స్పష్టం చేశారు. నిపుణులైన పరిశోధకులు తమ పనిని వేగవంతం చేయడానికి ఏఐ సాధనాలను ఎలా ఉపయోగించుకోవచ్చో ఈ ఘటన నిరూపిస్తోంది. లోపాలను నివేదించిన తర్వాత, ఓపెన్ఏఐ వాటిని సరిచేసి, వారికి బహుమతిగా $6,500 (సుమారు రూ. 5.5 లక్షలు) చెల్లించింది.