ఏఐ చేసిన ఒక్క తప్పు.. అమెరికా-చైనా యుద్ధం దాకా వెళ్లిందా?
- ఏఐ తప్పుడు రిపోర్ట్‌తో చైనా నౌకను అడ్డుకునేందుకు సిద్ధమైన అమెరికా
- నౌకలో అణ్వాయుధ పరికరాలున్నాయన్న సమాచారం తప్పని గుర్తింపు
- చివరి నిమిషంలో ఆపరేషన్ నిలిపివేత
- ఘటన దాదాపు యుద్ధానికి దారితీసిందని సమాచారం
- హాంకాంగ్‌కు మళ్లించిన ఎఫ్-35 కీలక భాగాలు కనిపించకుండా పోయినట్లు సమాచారం
కృత్రిమ మేధ (ఏఐ) ఇచ్చిన తప్పుడు సమాచారం అమెరికా, చైనా మధ్య దాదాపు యుద్ధానికి దారితీసే పరిస్థితి తీసుకొచ్చింది. అగ్రరాజ్య సైన్యం ఓ చైనా నౌకను అడ్డుకునేందుకు దాదాపు సిద్ధమైనట్లు సీఎన్‌ఎన్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది తొలినాళ్లలో మధ్యప్రాచ్యంలో ఈ ఘటన జరిగింది.
చైనా నౌకలో అణ్వాయుధాలకు సంబంధించిన పరికరాలు ఉన్నాయన్న నిఘా సమాచారంతో అమెరికా బలగాలు రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఆ సమాచారం తప్పని చివరి నిమిషంలో గుర్తించడంతో ఆపరేషన్‌ను నిలిపివేయడంతో పెను ప్రమాదమే తప్పింది.
అమెరికా నిఘా నివేదిక తయారీలో ఓ విశ్లేషకుడు ఏఐ చాట్‌బాట్ సాయం తీసుకున్నట్లు సీఎన్‌ఎన్ తెలిపింది. నౌకలో ఉన్న వస్తువులను ఆ చాట్‌బాట్ తప్పుగా గుర్తించింది. దీంతో నౌకలో అణ్వాయుధాలకు సంబంధించిన పరికరాలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. ఆ సమాచారం ఆధారంగా అమెరికా సైన్యం నౌకను తనిఖీ చేసేందుకు సిద్ధమైంది.
అయితే చర్యలు చేపట్టే ముందు అధికారులు నివేదికను మరోసారి పరిశీలించారు. అందులోని సమాచారం తప్పని గుర్తించారు. దీంతో ఆపరేషన్‌ను విరమించుకున్నారు. ఈ ఘటనపై సమాచారం ఉన్న నలుగురు వ్యక్తులను ఉటంకిస్తూ సీఎన్‌ఎన్ కథనం ప్రచురించింది. వారిలో ఓ వ్యక్తి ఈ నివేదిక పూర్తిగా తప్పని, అయినా అది దాదాపు యుద్ధానికి దారితీసే పరిస్థితిని తెచ్చిందని చెప్పినట్లు పేర్కొంది.
నౌకలో అసలు ఏం ఉందో? అది ఎక్కడికి వెళ్తుందో మాత్రం వెల్లడించలేదు. ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ వెంటనే స్పందించలేదు.
మరోవైపు అమెరికా సైన్యానికి చెందిన ఎఫ్-35 యుద్ధవిమానాల కీలక విడిభాగాలు హాంకాంగ్‌కు మళ్లించి, ప్రస్తుతం కనిపించకుండా పోయినట్లు పొలిటికో మరో కథనంలో తెలిపింది. ఆస్ట్రేలియా నుంచి మరమ్మతుల కోసం అమెరికాకు తరలిస్తున్న సమయంలో ఈ భాగాలను దారి మళ్లించినట్లు పేర్కొంది. వీటిలో విమానం కాక్‌పిట్‌కు సంబంధించిన సున్నితమైన స్టెల్త్ కేనపీ కూడా ఉన్నట్లు తెలిపింది.
ఈ భాగాలు ఎక్కడున్నాయో స్పష్టత లేదు. అవి చైనా చేతికి చేరాయేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది. విడిభాగాల రవాణాపై భద్రతా కారణాలతో వివరాలు వెల్లడించలేమని లాక్‌హీడ్ మార్టిన్ తెలిపింది.