7,000mAh భారీ బ్యాటరీతో ఒప్పో కొత్త బడ్జెట్‌ ఫోన్‌.. ధర ఫీచర్లు ఇవే..!

7,000mAh భారీ బ్యాటరీతో ఒప్పో కొత్త బడ్జెట్‌ ఫోన్‌.. ధర ఫీచర్లు ఇవే..!

Oppo new budget phone with 7000mAh huge battery price and features
  • ఆఫర్‌ ధర రూ.15,999
  • 6.75 అంగుళాల 120Hz డిస్‌ప్లే
  • 7,000mAh భారీ బ్యాటరీ
  • యూనిసాక్‌ టీ7250 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌
  • 13MP వెనుక, 5MP ముందు కెమెరాలు
ఒప్పో కొత్త కే14 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. రూ.16,999 ధరకు వచ్చిన ఈ ఫోన్‌లో 6.75 అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 7,000mAh భారీ బ్యాటరీ ఉన్నాయి. ఫీదర్‌ పర్పుల్‌, స్టోన్‌ బ్రౌన్‌ రంగుల్లో లభిస్తుంది. ఒప్పో ఈ ఫోన్‌ను ఈరోజు నుంచే తన ఈ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తోంది.

4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.16,999. ఎంపిక చేసిన బ్యాంక్‌ ఆఫర్లతో రూ.1,000 తక్షణ డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ధర రూ.15,999కు తగ్గుతుంది. అదనంగా మూడు నెలల నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

కే14 లైట్‌లో 6.75 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 900 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. చేతులు తడిగా ఉన్నా, నూనె అంటుకున్నా, గ్లౌజులు వేసుకున్నా స్క్రీన్‌ను ఉపయోగించుకునేలా స్ప్లాష్‌ టచ్‌, ఆయిలీ హ్యాండవ్‌ టచ్‌, గ్లవ్‌ టచ్‌ ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఫోన్‌లో యూనిసాక్‌ టీ7250 ప్రాసెసర్‌, 4జీబీ ఎల్‌పీడీడీఆర్‌4ఎక్స్‌ ర్యామ్‌, 64జీబీ యూఎఫ్‌ఎస్‌ 2.2 స్టోరేజ్‌ ఉన్నాయి. వేడి తగ్గించేందుకు 13,700 చదరపు మిల్లీమీటర్ల వరకు థర్మల్‌ గ్రాఫైట్‌ కూలింగ్‌ ప్రాంతాన్ని ఇచ్చారు. ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత కలర్‌ఓఎస్‌ 16పై పనిచేస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే.. వెనుక 13MP ఆటోఫోకస్‌ కెమెరా, ముందు 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. పోర్ట్రెయిట్‌, నైట్‌, టైమ్‌ల్యాప్స్‌ మోడ్‌లతో పాటు ఏఐ ఎరేజర్‌, ఏఐ క్లియర్‌ ఫేస్‌, ఏఐ స్మార్ట్‌ ఇమేజ్ మ్యాటింగ్‌ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి. గూగుల్‌ జెమినీ, గూగుల్‌ ఏఐ అసిస్టెంట్‌కు కూడా సపోర్ట్‌ ఉంది.

7,000mAh బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 55.55 గంటల వరకు కాలింగ్‌, 26.84 గంటల వరకు యూట్యూబ్‌ వీడియో ప్లేబ్యాక్‌, 13.19 గంటల వరకు పబ్‌జీ మొబైల్‌ గేమింగ్‌ అందిస్తుందని ఒప్పో చెబుతోంది. 15W ఛార్జింగ్‌, రివర్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌ కూడా ఉన్నాయి. 1,800 ఛార్జింగ్‌ సైకిళ్ల తర్వాత కూడా బ్యాటరీ సామర్థ్యం 80 శాతానికి పైగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.
Advertisement
Oppo K14 Lite
Oppo budget smartphone price
7000mAh battery phone
Oppo K14 Lite features
Flipkart mobile deals
Unisoc T7250 processor

More Telugu News