కదులుతున్న రైల్లోకి పార్శిల్.. అద్భుతమైన టైమింగ్‌తో డెలివరీ.. వీడియో వైరల్!
- ఆగని రైలులోని ప్రయాణికుడికి పార్శిల్ అందించిన వ్యక్తి
- ట్రాక్ పక్కన నిల్చొని రైలు రాగానే ప్యాకేజీని విసిరిన వైనం
- ముందే ఫోన్‌లో మాట్లాడుకుని ఈ డెలివరీ ప్లాన్
- సమయస్ఫూర్తి, పక్కా టైమింగ్‌పై నెటిజన్ల ప్రశంసలు
సాధారణంగా రైలు స్టేషన్‌లో ఆగినప్పుడు లగేజీ లేదా ఇతర వస్తువులు ప్రయాణికులకు అందిస్తుంటారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం ఆగకుండా వేగంగా వెళ్తున్న రైలులోకి ఒక పార్శిల్‌ను విజయవంతంగా అందజేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పక్కా టైమింగ్‌తో అతడు చేసిన ఈ పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆయేషా మజీద్ ఖాన్ అనే యూజర్ 'ఎక్స్' (ట్విట్టర్)లో షేర్ చేసిన ఈ వీడియోలో.. ఒక వ్యక్తి రైల్వే ట్రాక్ పక్కన నిల్చొని ఉండటం కనిపిస్తుంది. రైలు వేగంగా వస్తుండగా, అతను సరైన వ్యక్తి కోసం ప్రతి కోచ్ డోర్ వైపు చూశాడు. ఒక డోర్ దగ్గర నుంచి చేయి ఊపుతున్న వ్యక్తిని గమనించి, వెంటనే తన చేతిలోని ప్యాకేజీని అతని వైపు విసిరాడు. రెప్పపాటులో అవతలి వ్యక్తి దాన్ని పట్టుకున్నాడు.
వీరిద్దరూ ముందే ఫోన్‌లో మాట్లాడుకుని ఈ డెలివరీ కోసం సమయం, ప్రదేశం నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ప్రయాణిస్తున్న రైలుకు ఆ ప్రాంతంలో హాల్ట్ లేకపోవడంతో తన బంధువుకు సంబంధించిన ప్యాకేజీని ఇలా వినూత్నంగా అందించాల్సి వచ్చిందని వీడియోకు జత చేసిన క్యాప్షన్‌లో తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారం కేవలం కొన్ని సెకన్లలోనే ముగిసింది. ఆ వ్యక్తి సమయస్ఫూర్తికి, కచ్చితమైన టైమింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతని తెలివిని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.