అసెంబ్లీలో బీఆర్ఎస్‌కు షాక్.. కేటీఆర్, హరీశ్‌రావు సహా సభ్యుల సస్పెన్షన్
- ఎర్రవల్లి వద్ద ‘చావుడప్పు’ నిరసనలపై బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన
- సభను అడ్డుకుంటున్నారని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపణ
- బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్‌పై తీర్మానం
- సభ జరిగే అన్ని రోజులకూ సస్పెన్షన్ వర్తింపు
- అనంతరం సభ 10 నిమిషాలు వాయిదా
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కోవా లక్ష్మి, సునీతా లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సెషన్‌లో సభ జరిగే అన్ని రోజులకు ఈ సస్పెన్షన్ వర్తించనుంది.
సభ ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ సభ్యులు నిన్నటి ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద ‘చావుడప్పు’ నిరసనలపై ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు.
దాదాపు గంటసేపటి నుంచి బీఆర్ఎస్ సభ్యులు సభను అడ్డుకుంటున్నారని మంత్రి తెలిపారు. వారిని సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది.
దీంతో బీఆర్ఎస్ సభ్యులను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.