ప్రాణాలు తీస్తున్న మ్యాన్‌హోళ్లు.. పాకిస్థాన్ పంజాబ్‌లో వినూత్న ప్రయోగం
- పాక్ పంజాబ్‌లో తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్ల సమస్యకు పరిష్కారం
- ప్రమాదాల నివారణకు మ్యాన్‌హోళ్లలో సేఫ్టీ నెట్ల ఏర్పాటు
- పనులను వేగవంతం చేయాలని సీఎం మరియం నవాజ్ ఆదేశం
- సమస్యను రిపోర్ట్ చేసేందుకు ‘ధక్కన్’ పేరుతో ప్రత్యేక యాప్
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఏళ్లుగా ఓ తీవ్రమైన సమస్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అదే తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్ల సమస్య. స్థానికంగా ‘ధక్కన్’ అని పిలిచే మ్యాన్‌హోల్ మూతలను దొంగలు ఎత్తుకెళ్లడంతో అవి మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, పాదచారులు వీటిలో పడి తీవ్రంగా గాయపడటం లేదా ప్రాణాలు కోల్పోవడం సర్వసాధారణంగా మారింది. ఈ ప్రమాదకర పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపేందుకు పంజాబ్ ప్రభుత్వం నడుం బిగించింది. భద్రతా చర్యలను ముమ్మరం చేస్తూ వినూత్నమైన విధానాలను అమలు చేస్తోంది.
ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించిన పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్, రాష్ట్రవ్యాప్తంగా తెరిచి ఉన్న ప్రతి మ్యాన్‌హోల్ లోపల వెంటనే భద్రతా వలలు (సేఫ్టీ నెట్లు) ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వీధి, కాలనీ, ప్రధాన రహదారిపై నాణ్యమైన సేఫ్టీ నెట్లతో పాటు దొంగతనాలకు అవకాశం లేని విధంగా పటిష్ఠమైన మూతలను బిగించాలని జిల్లా యంత్రాంగాలు, మున్సిపల్ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం మరియం నవాజ్ మాట్లాడుతూ.. "పంజాబ్‌లోని ప్రతి పౌరుడిని, ముఖ్యంగా మన అమాయక పిల్లలను రక్షించడమే మా లక్ష్యం. అందుకోసం తెరిచిన మ్యాన్‌హోళ్లలో సేఫ్టీ నెట్లను ఏర్పాటు చేసే ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టాం. ప్రజల భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదు. ఈ కొత్త విధానం మూతల దొంగతనాలకు కూడా అడ్డుకట్ట వేస్తుందని ఆశిస్తున్నాం" అని తెలిపారు.
భౌతిక చర్యలతో పాటు సాంకేతికతను కూడా ఈ సమస్య పరిష్కారానికి జోడించారు. ‘ధక్కన్’ పేరుతో ఓ ప్రత్యేక మొబైల్ యాప్‌ను వినియోగంలోకి తెచ్చారు. ఈ యాప్ ద్వారా ప్రజలు తమ ప్రాంతంలో ఎక్కడైనా మూత లేని మ్యాన్‌హోల్ కనిపిస్తే వెంటనే ఫొటో తీసి, యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ఆ ఫొటో ఆధారంగా సంబంధిత అధికారులు వెంటనే ఆ ప్రదేశాన్ని గుర్తించి, ప్రమాదం జరగకముందే మరమ్మతులు చేయడానికి వీలవుతుంది. ఈ డిజిటల్ రిపోర్టింగ్ విధానం ద్వారా ప్రమాదకరమైన మ్యాన్‌హోళ్లను వేగంగా గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.