నాని సినీ ప్రయాణానికి 18 ఏళ్లు.. ఫ్యాన్స్‌కు నేచురల్ స్టార్ స్వీట్ మెసేజ్
- అభిమానుల ప్రేమను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోలేదన్న నాని
- భవిష్యత్తులోనూ తీసుకోబోనని వ్యాఖ్య
- 2008లో ‘అష్టాచమ్మా’తో మొదలైన నాని హీరో ప్రయాణం
- సెప్టెంబర్ 24న ‘ది ప్యారడైజ్’ విడుదల
హీరో నాని సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులు, ప్రేక్షకులకు అతడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. వారి ప్రేమను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోలేదని చెప్పారు. ఇకపై కూడా అలా చేయబోనని స్పష్టం చేశాడు.
‘‘18 ఏళ్లు.. అధికారికంగా సినిమాల్లో పెద్దవాడినయ్యా’’ అంటూ నాని ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. ‘‘మీ ప్రేమను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోలేదు.. ఇకపై కూడా తీసుకోబోను’’ అని రాసుకొచ్చాడు.
నాని హీరోగా పరిచయమైన తొలి చిత్రం ‘అష్టా చమ్మా’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2008 సెప్టెంబర్ 5న విడుదలైంది. అప్పటి నుంచి నటుడిగా మొదలైన నాని ప్రస్థానం హీరోగా, నిర్మాతగా ఎదిగే స్థాయికి చేరింది.
ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’లో నటిస్తున్నాడు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత మార్చి 26న విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఆగస్టు 21కి మార్చారు. చివరగా సెప్టెంబర్ 24కు వాయిదా వేశారు.
ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. రక్తంతో తడిసిన లుక్‌లో నాని కనిపించడం అభిమానుల్లో ఆసక్తి పెంచింది. రెండు జడలతో కనిపిస్తూ.. చేతిలో బ్లేడ్‌లతో చేసిన గొలుసుతో నాని కనిపించే సన్నివేశాలు టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అణచివేతకు గురైన ప్రజలు తిరుగుబాటు చేయడం చుట్టూ కథ సాగుతుందనే సంకేతాలు టీజర్ ఇచ్చింది. ఇందులో మోహన్‌బాబు ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ‘‘ఈ దేశం ఎవరిది? మనది’’ అనే డైలాగ్‌లు టీజర్‌లో వినిపించాయి.
‘ది ప్యారడైజ్’ హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లిష్, స్పానిష్, బెంగాలీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.