బరువు తగ్గినా పొట్ట చుట్టూ కొవ్వు ఎందుకు కరగదు.. అసలు కారణం ఇదేనట!
- కొవ్వు కణాల్లో ‘ఊబకాయం జ్ఞాపకం’ ఉండొచ్చన్న అధ్యయనం
- బరువు తగ్గినా కొన్ని జన్యు మార్పులు కొనసాగుతున్నట్లు గుర్తింపు
- ఎలుకలు మళ్లీ వేగంగా బరువు పెరిగినట్లు పరిశీలన
- పొట్ట కొవ్వుకు మాత్రమే ప్రత్యేక జ్ఞాపకం ఉందన్నది నిర్ధారణ కాని వైనం
- కొవ్వు తగ్గడం జన్యువులు, హార్మోన్లపై ఆధారపడి ఉంటుందన్న అధ్యయనం
బరువు తగ్గాలని ప్రయత్నించే చాలామందికి ఓ సమస్య తరచూ ఎదురవుతుంది. ముఖం, చేతులు, కాళ్లలో కొవ్వు తగ్గినా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు మాత్రం అంత త్వరగా తగ్గదు. దీనికి శరీరంలో జరిగే కొన్ని జీవ ప్రక్రియలు కారణం కావచ్చని తాజా అధ్యయనం చెబుతోంది. గతంలో ఊబకాయం ఉన్న సమయంలో కొవ్వు కణజాలంలో ఏర్పడిన మార్పులు.. బరువు తగ్గిన తర్వాత కూడా కొంతకాలం కొనసాగుతాయని పరిశోధకులు గుర్తించారు.
‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో మనుషులు, ఎలుకల కొవ్వు కణజాలాన్ని పరిశీలించారు. ఊబకాయం ఉన్న సమయంలో కొవ్వు కణాల్లో మారిన జన్యు కార్యకలాపాల్లో కొన్ని.. గణనీయంగా బరువు తగ్గిన తర్వాత కూడా అలాగే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఎలుకలపై చేసిన పరిశోధనలోనూ ఇదే తరహా ఫలితాలు కనిపించాయి. ఊబకాయం కారణంగా కొవ్వు కణాల్లోని ఎపిజీనోమ్‌లో దీర్ఘకాలిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవి జీవక్రియ, ఇన్‌ఫ్లమేషన్, కొవ్వు కణాల పనితీరుకు సంబంధించిన ప్రక్రియలను ప్రభావితం చేశాయి. బరువు తగ్గిన తర్వాత కూడా ఈ మార్పుల్లో కొన్ని కొనసాగాయి.
గతంలో ఊబకాయం ఉన్న ఎలుకలకు మళ్లీ అధిక కొవ్వు ఉన్న ఆహారం ఇచ్చినప్పుడు అవి వేగంగా బరువు పెరిగాయి. కొవ్వు కణాల్లో మిగిలిపోయిన ఈ మార్పులు శరీరాన్ని మళ్లీ శక్తిని నిల్వ చేసుకునేలా ప్రభావితం చేసి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. దీనినే శాస్త్రవేత్తలు ‘ఊబకాయం జ్ఞాపకం’గా అభివర్ణిస్తున్నారు. అయితే ఇది మెదడులోని జ్ఞాపకంలా ఉండదు. ఊబకాయం సమయంలో కణాల్లో ఏర్పడిన పరమాణు స్థాయి మార్పులను ఇలా పిలుస్తున్నారు.
అయితే ఈ అధ్యయనం పొట్ట కొవ్వుకు మాత్రమే ప్రత్యేకమైన ‘జ్ఞాపకం’ ఉంటుందని చెప్పడం లేదు. శరీరంలో కొవ్వు ఎక్కడ పేరుకుపోతుంది, ఎక్కడి నుంచి ముందుగా తగ్గుతుంది అన్నది జన్యువులు, హార్మోన్లు, వయసు, లింగం, ఆహారం, శారీరక శ్రమ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. పొట్టలో చర్మం కింద ఉండే కొవ్వుతో పాటు అంతర్గత అవయవాల చుట్టూ ఉండే కొవ్వు కూడా ఉంటుంది.
అయితే బరువు తగ్గిన తర్వాత దాన్ని కొనసాగించడం ఎందుకు కష్టమో అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన కీలక ఆధారాన్ని అందిస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర, కండరాల బలోపేత వ్యాయామాలు బరువును నియంత్రించడంలో ఉపయోగపడతాయి. ఊబకాయం ఉన్నవారికి వైద్యుల సూచనతో చికిత్స తీసుకోవడం కూడా అవసరం కావచ్చు. భవిష్యత్తులో కొవ్వు కణాల్లోని ఈ మార్పులను లక్ష్యంగా చేసుకుని బరువు తిరిగి పెరగకుండా చేసే మెరుగైన చికిత్సలు అభివృద్ధి చేసే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.