ప్రపంచం తడబడుతున్నా.. భారత్ దూసుకెళ్తోంది: పవన్ కల్యాణ్
- తొలి త్రైమాసికంలో భారత్ జీడీపీ 7.8% వృద్ధి
- వృద్ధి దేశ ఆర్థిక బలానికి నిదర్శనమన్న పవన్
- ప్రపంచ అనిశ్చితిపై భారత్ స్థైర్యం చాటిందని వెల్లడి
- మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన పవన్ కల్యాణ్
- డిజిటల్ రంగం, మౌలిక వసతుల్లో పురోగతి ఉందని వ్యాఖ్య
భారత్ జీడీపీ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి నమోదు చేయడం దేశ ఆర్థిక స్థైర్యం, విశ్వాసానికి నిదర్శనమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరల్లో హెచ్చుతగ్గులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు కొనసాగుతున్నా భారత్ తన బలాన్ని చాటుకుందని పేర్కొన్నారు.
ఈ మేరకు పవన్ కల్యాణ్ మంగళవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. జీడీపీ వృద్ధి కేవలం ఒక సంఖ్య కాదని, దేశ ప్రజల సమష్టి శక్తిని ప్రతిబింబిస్తోందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటూ దేశం ముందుకు సాగుతోందన్నారు.
2014 నుంచి భారత్ ఆర్థికంగా మరింత బలపడిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. స్వయం సమృద్ధి, డిజిటల్ రంగం, మౌలిక వసతుల అభివృద్ధిలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. యువత పెద్ద కలలు కనడంతో పాటు ఆవిష్కరణలు, వ్యాపారాలు, సాంకేతిక రంగంలో ముందుకు సాగేందుకు అవకాశాలు పెరిగాయని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నా భారత్ అభివృద్ధి పథంలో కొనసాగుతోందని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ వేదికపై దేశానికి విశ్వసనీయత, ప్రాధాన్యం పెరిగిందని పేర్కొన్నారు. బలమైన, స్వయం సమృద్ధి, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే దేశంగా ‘వికసిత్ భారత్’ దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు.