తెలంగాణలో చురుగ్గా రుతుపవనాలు.. పలు జిల్లాలకు హెచ్చరిక
- తెలంగాణలో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ
- బంగాళాఖాతం ప్రభావంతో చురుగ్గా రుతుపవనాలు
- ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు
- గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలుల హెచ్చరిక
- హైదరాబాద్‌లో సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పలు జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. వర్షం కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
ఇక హైదరాబాద్ నగరంలో ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో పలు చోట్ల ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.