ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు సుప్రీంలో భారీ ఊరట.. రూ.5 కోట్లు వాపసు చేయాలని డీడీఏకు ఆదేశం
- రూ. 5 కోట్ల పర్యావరణ నష్టపరిహారాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశం
- ఎన్జీటీ ఇచ్చిన తీర్పును తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం
- 2016లో యమునా నది ఒడ్డున జరిగిన సాంస్కృతిక ఉత్సవంపై వివాదం
- ఫౌండేషన్ వాదనలతో ఏకీభవించి, అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2016లో యమునా నది వరద మైదానాల్లో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం నిర్వహణ సందర్భంగా పర్యావరణానికి నష్టం కలిగించారన్న ఆరోపణలపై ఫౌండేషన్ నుంచి వసూలు చేసిన రూ.5 కోట్ల నష్టపరిహారాన్ని తిరిగి చెల్లించాలని ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ)ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు శనివారం రద్దు చేసింది.
శ్రీశ్రీ రవిశంకర్ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు చెందిన భారతీయ సంస్థ 'వ్యక్తి వికాస్ కేంద్ర ఇండియా' (వీవీకేఐ) దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ ఎస్.సి. శర్మ, జస్టిస్ ఎన్.కె. సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఎన్జీటీ నిర్ధారణలతో ధర్మాసనం విభేదించింది.
2016 మార్చి 11 నుంచి 13 వరకు డీడీఏ నుంచి అనుమతి తీసుకుని యమునా నది ఒడ్డున ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం రోడ్లు, ర్యాంపులు, ఇతర తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడం వల్ల నది ప్రవాహానికి, వరద మైదానాలకు నష్టం వాటిల్లిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై 'యమునా జియే అభియాన్' కన్వీనర్, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి మనోజ్ మిశ్రా ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన ఎన్జీటీ, నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా 2017 డిసెంబర్‌లో తీర్పు ఇచ్చింది. యమునా వరద మైదానాలకు నష్టం వాటిల్లడానికి ఫౌండేషనే కారణమని తేల్చింది. కార్యక్రమానికి ముందు ఫౌండేషన్ డిపాజిట్ చేసిన రూ.5 కోట్ల సెక్యూరిటీని జప్తు చేసి, ఆ నిధులను దెబ్బతిన్న ప్రాంతాల పునరుద్ధరణకు వినియోగించాలని డీడీఏను ఆదేశించింది.
ఎన్జీటీ తీర్పును సవాలు చేస్తూ వీవీకేఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాము కార్యక్రమం నిర్వహించిన ప్రాంతం వరద మైదానంగా ఎప్పుడూ గుర్తింపు పొందలేదని వాదించింది. మూడు రోజుల కార్యక్రమం వల్ల పర్యావరణ నష్టం జరిగిందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని, భూమి యజమాని అయిన డీడీఏ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే కార్యక్రమం నిర్వహించామని స్పష్టం చేసింది. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు, ఎన్జీటీ తీర్పును పక్కనపెట్టింది. డీడీఏ వద్ద సెక్యూరిటీగా ఉన్న రూ.5 కోట్లను ఫౌండేషన్‌కు తిరిగి చెల్లించాలని ఆదేశిస్తూ తుది తీర్పును వెలువరించింది.