ఢిల్లీలో తీవ్ర భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం

Delhi NCR witnesses strong earthquake tremors as people run out of houses
  • ఢిల్లీ, ఉత్తర భారతదేశంలో శనివారం సాయంత్రం భూప్రకంపనలు
  • ఆఫ్ఘనిస్థాన్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వెల్లడి
  • భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం బలమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక జనం ఆందోళన చెందారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన 6.2 తీవ్రత కలిగిన భారీ భూకంపం కారణంగానే ఈ ప్రకంపనల వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 7:04 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో, భూమికి 215 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ భూకంప ప్రభావంతో జమ్ముకశ్మీర్, ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాల్లో భూమి స్పష్టంగా కంపించింది. బహుళ అంతస్తుల భవనాలు ఊగిపోవడంతో నివాసితులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. పలుచోట్ల ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో గుమిగూడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూశాయి. అయితే, ఈ భూప్రకంపనల వల్ల భారత్‌లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు స్పష్టం చేశారు.
Delhi NCR
Earthquake
Afghanistan Earthquake
North India Tremors
Hindu Kush Region

More Telugu News