హైదరాబాద్‌లో ఇద్దరు రౌడీషీటర్ సోదరులపై పీడీ యాక్ట్
- హత్యలు, వసూళ్లకు పాల్పడుతున్నారని పోలీసుల ఆరోపణ
- బెయిల్‌పై విడుదలై మళ్లీ నేరాలు చేస్తున్నారని వెల్లడి
- నిందితులను అరెస్ట్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
గత కొంతకాలంగా ఈ సోదరులు హత్యలు, హత్యాయత్నాలు, బలవంతపు వసూళ్లు, బెదిరింపులు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారని సీపీ పేర్కొన్నారు. ఆయుధాలతో అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒమర్ బిన్ హంజాపై 8 క్రిమినల్ కేసులు, అలీ బిన్ హంజాపై 7 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని వివరించారు.
గతంలో పలు కేసుల్లో అరెస్టయిన వీరు, బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా నేర కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని రెయిన్‌బజార్ పోలీసులు నివేదిక సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు సజ్జనార్ తెలిపారు. సీపీ ఆదేశాలతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.