విశాఖలో వైరల్ అవుతున్న గోల్డ్ కలర్ కారు... డీటెయిల్స్ ఇవిగో!
- విశాఖ బీచ్ రోడ్డులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బంగారు వర్ణపు కారు
- సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరుస్తున్న స్థానికులు
- కారుకు బంగారపు రంగు వేయించడానికి రూ.1 లక్ష ఖర్చయినట్లు వెల్లడి
యజమాని రవి మాట్లాడుతూ, తమకు జ్యువెల్లరీ వ్యాపారం ఉందని, అందుకే కారుకు బంగారపు రంగు వేయించినట్లు చెప్పారు. ఈ కారు తెలుగు రంగులో వచ్చిందని, కానీ విశాఖలోనే బంగారపు రంగును వేయించానని చెప్పారు. దీని కోసం రూ.1 లక్ష ఖర్చయిందని, పూర్తవడానికి నెల రోజులు పట్టిందని వెల్లడించారు. బంగారపు రంగు వేయడానికి ప్రత్యేకంగా కారణమేమీ లేదని, సరదాగా వేయించానని అన్నారు. దీనికి ఐదేళ్లు గ్యారెంటీ ఇచ్చినట్లు చెప్పారు.