పెండింగ్ డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్: మంత్రి పొంగులేటి
- హైదరాబాద్లో ఇళ్ళ స్థలాలు ఉంటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న మంత్రి
- జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ ప్రారంభిస్తామని వెల్లడి
- విధివిధానాలను ఈ నెల 21న ఖరారు చేస్తామన్న మంత్రి
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆదిలాబాద్లో ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. రెండో విడతకు సంబంధించిన విధివిధానాలను ఈ నెల 21న ఖరారు చేస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ళ కోసం స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి తెలిపారు.