విజయ్‌కి బిగ్ రిలీఫ్... మద్దతు లేఖను ఈమెయిల్ చేసిన వీసీకే పార్టీ
- టీవీకేకు లేఖను ఈమెయిల్ చేసినట్లు 'ఎక్స్' ద్వారా వెల్లడి
- అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచిన వీసీకే పార్టీ
- వీసీకే మద్దతుతో 118కి చేరిన విజయ్ బలం
వీసీకే పార్టీ నిన్నటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈరోజు మాత్రం విజయ్‌కి మద్దతివ్వాలని నిర్ణయించింది. అయితే వివిధ డిమాండ్లకు టీవీకే అంగీకరించకపోవడంతో వీసీకే మద్దతుపై వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఏం జరిగిందో ఏమో కానీ, ఆ తర్వాత కాసేపటికే మద్దతు పలుకుతున్నట్లు లేఖను ఈమెయిల్ చేసినట్లు తెలిపింది. ఎక్స్ వేదికగా తమ పార్టీ అధినేత, టీవీకే చీఫ్‌తో చేయి కలుపుతున్నట్లుగా ఉన్న ఏఐ చిత్రాన్ని షేర్ చేసింది.