బతుకమ్మ కుంటలో చెరువులేదని కోర్టుకు వెళ్లిన సుధాకర్ రెడ్డి.. స్పందించిన హైడ్రా కమిషనర్
- సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం పదెకరాల చెరువు ఉందన్న రంగనాథ్
- భూమికి తానే యజమానిని అని, అక్కడ వ్యవసాయం చేశానని చెబుతున్నారన్న కమిషనర్
- చెరువులో ఉన్న భూమికి పట్టాలు ఎలా వస్తాయని ప్రశ్న
కానీ అసలు చెరువులో ఉన్న భూమికి పట్టాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. చెరువును పూడ్చి కూడా వ్యవసాయం చేయవచ్చని అన్నారు. అలా చేసినంత మాత్రాన చెరువుకు యజమాని అయిపోరు కదా అని వ్యాఖ్యానించారు. చెరువు ఉన్న ప్రాంతంలో నిరుపేదలు ఉంటే వారిని ఖాళీ చేయించి, వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని అన్నారు. ఇందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉందని తెలిపారు.