ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు.. రఘురామకు ఐపీఎస్ సునీల్ కుమార్ వార్నింగ్
- ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఫైర్
- 'గేదెలా పెరిగావ్, సంస్కారం లేదా?' అంటూ వ్యక్తిగత విమర్శలు
- తన కోటుపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సునీల్ కుమార్
- హద్దులు దాటితే ఊరుకునేది లేదని రఘురామకు గట్టి హెచ్చరిక
- బ్యాంకులను మోసం చేస్తేనే బతుకుతావంటూ ఆరోపణలు
తన వస్త్రధారణపై రఘురామ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సునీల్ కుమార్ తీవ్రంగా స్పందించారు. "నేను వేసుకున్న కోటు గురించి మాట్లాడటానికి నువ్వెవరు? నీ సొమ్ములతో ఏమైనా కొనిచ్చావా? 'వాడు, వీడు' అని మాట్లాడతావా? గోదావరి జిల్లాల్లో... పనిచేసే వాళ్లను కూడా 'బాబు' అని గౌరవంగా పిలుస్తారు. ఆ సంస్కారం కూడా నీకు లేదా?" అని ప్రశ్నించారు. "పొద్దున లేస్తే బ్యాంకులను మోసం చేస్తే గానీ నువ్వు బతకలేవు!" అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
రఘురామ తన చుట్టూ ఎంగిలి మెతుకులు తినే కుక్కలను తయారు చేసుకున్నాడని, ఆయనకు మద్దతిచ్చే రెండు ఛానళ్లను ఎవరూ పట్టించుకోరని అన్నారు. "నువ్వెంత, నీ బతుకెంత? సంస్కారం, హద్దులు దాటి మాట్లాడితే ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఈసారి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. లేదంటే నేను కూడా తిట్టాల్సి ఉంటుంది... మాట్లాడడం మాకూ వచ్చు" అని సునీల్ కుమార్ తీవ్రంగా హెచ్చరించారు.